టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్‌మెంట్ చేసిన చింటూ | Chittoor Mayor murder case, chintu escaped, still searching | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్‌మెంట్ చేసిన చింటూ

Published Sat, Nov 28 2015 10:02 AM | Last Updated on Mon, Aug 13 2018 3:23 PM

టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్‌మెంట్ చేసిన చింటూ - Sakshi

టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్‌మెంట్ చేసిన చింటూ

చిత్తూరు : చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ పలువురు టీడీపీ నేతలకు సాయపడినట్లు పోలీసులు విచారణలో వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తుండగా పలు విషయాలు వెల్లడి అయినట్లు సమాచారం. చిత్తూరులో అధికార పార్టీలో ఉంటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ నేత ఇటీవల చింటూ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముంబాయిలో తనకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి మాఫియా ద్వారా చింటూ సెటిల్ చేసినట్లు, చింటూ అనుచరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనికి ప్రతిఫలంగా చింటూకు ఆ నేత విదేశీ తుపాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న చింటూ భారత్కు సమీప దేశాల్లోని ద్వీపాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement