
ఇంటెలిజెన్స్ వైఫల్యం - చంద్రబాబు
చిత్తూరు: ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం వల్లే చిత్తూరు మేయర్ దంపతుల హత్యోదంతం చోటుచేసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుట్రను ముందుగా గుర్తించివుంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యలు జరిగియన్నారు. హత్యాస్థలిని క్షుణ్నంగా పరిశీలించినట్టు చెప్పారు.
నిందితుల్లో ఇద్దరు దొరకాల్సివుందని వెల్లడించారు. హత్యారాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దుండగుల దాడిలో హత్యకు గురైన మేయర్ కఠారి అనురాధ, మోహన్ భౌతిక కాయాలకు చంద్రబాబు నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా శ్రద్ధాంజలి ఘటించారు.