katari mohan
-
మేయర్ హత్య కేసులో చార్జ్‌షీట్ దాఖలు
- 23 మంది నిందితులు.. 130 మంది సాక్షులు - 4 పిస్తోళ్లు, 8 వాహనాలు, 3 కత్తులు సీజ్ చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో నేర అభియోగ పత్రం (చార్జ్‌షీట్) దాఖలైంది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు డీఎస్పీ ఎం.లక్ష్మినాయుడు శుక్రవారం స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో న్యాయమూర్తి యుగంధర్‌కు చార్జ్‌షీట్‌ను సమర్పించారు. గత ఏడాది నవంబర్ 17న చిత్తూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధను తుపాకీతో కాల్చడంతో పాటు ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో దాడిచేయడంతో వారు మృతి చెందారు. దాడి జరిగిన రోజు ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నవంబరు 21న వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 90 రోజుల్లో వారిపై మోపిన అభియోగాలకు సంబంధించి దర్యాప్తు అధికారి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో నిందితులకు స్వచ్ఛందంగా బెయిలు మంజూరు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. 90 రోజుల గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చార్జ్‌షీటులో ఏముందంటే.. మేయర్ అనురాధ, మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటా చలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగన్, వెంకట యోగానంద్, పరంధామ, మొగిలి, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటి బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకట ఆనంద్‌కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, శ్రీనివాస ఆచారి, కాసారం రమేష్, బుల్లెట్ సురేష్ అనే 23 మంది నిందితులుగా ఉన్నారు. నిందితులపై ఐపీసీ 147, 148, 302, 307, 120 (బీ ఆర్డబ్ల్యూ) 149, సెక్షన్ 25 (1బీ) ఏ, 25 (1) (ఏఏఏ), 27 మారణాయుధాల నిరోధక చట్టం సెక్షన్ 212, 216 కింద (క్రైమ్ నెం.130/2105) కేసు నమోదు చేశారు. హత్య జరిగిన తరువాత ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మేయర్ దంపతుల మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణులు ఇచ్చిన నివేదికలతోపాటు దర్యాప్తు అధికారి మొత్తం 130 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ ఘటనలో నిందితుల నుంచి నాలుగు పిస్తోళ్లు, 8 వాహనాలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిందితుల పాత్ర, మృతులతో వీరికి ఉన్న కక్షలు, సంబంధాలపై సవివరంగా పేర్కొన్నారు. ఈ కేసులో ఆర్వీటి బాబు, కాసారం రమేష్, వెంకట ఆనంద్‌కుమార్ బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన 20 మంది రిమాండు ఖైదీలుగా పలు జైళ్లలో ఉన్నారు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. -
మహిళా కార్పొరేటర్ ఇంట్లో సోదాలు
చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతడితో ఆర్థిక లావాదేవీలు ఉన్న 11 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింటూ సంబంధించిన ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అతడికి చిత్తూరుతో పాటు కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. చింటూకు అత్యంత సన్నిహితులైన పరంధామ, హరిదాసు, హరిదాస్, మొగిలి, వెంకటేశ్, ప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోహన్ ను నరికిన కత్తిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ను దుండగులు ఈనెల 17న దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మోహన్ మేనల్లుడు చింటూ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. -
కఠారి హత్యవెనుక టీడీపీ నేతలు?
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన కఠారి మోహన్‌తో ఆ పార్టీలోనే కొందరికి వర్గవిభేదాలున్నాయా? మోహన్‌ను అంతమొందించేందుకు అధికారపార్టీ నేతలే కుట్రపన్నారా? ఇందుకోసం అధికారమూ.. ఆధిపత్యమూ నీదేనంటూ మేనల్లుడు చింటూను రెచ్చగొట్టారా? వారి భరోసాతోనే చంపేంత పగలేకపోయినా చింటూ మేనమామ కఠారి దంపతులను హత్యచేశాడా?.. ఈ ప్రశ్నలకు రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. హత్య వెనుక అధికారపార్టీ నేతల కుట్ర ఉండడంలో ఆశ్చర్యం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే అంటున్నట్టు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నేతల్లో అక్కసు.. చిత్తూరు పరిధిలోని ఓ ముఖ్యనేత, మరికొందరు స్థానిక నేతల అండతో కఠారి మోహన్ టీడీపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో గొడవల నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది. నగరానికి చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఇది జీర్ణించుకోలేకపోయారు. మోహన్ భార్య అనురాధ మేయర్ అయ్యాక ఆ కుటుంబం ఎవర్నీ లెక్కచేయట్లేదని, నగర పరిధిలో అభివృద్ధి పనుల కేటాయింపులోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఓ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురు అధికారపార్టీ నేతలు మోహన్‌పై అక్కసు పెంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్‌కోసం పోటీపడిన మోహన్.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌కోసం గట్టి పోటీదారయ్యే అవకాశముండడంతో వారు ఆయన ఆధిపత్యానికి అడ్డ్డుకట్ట వేసేందుకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీలో అంతర్గతపోరు ముదిరిపోయింది. చింటూను రెచ్చగొట్టారా? మామ కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన చంద్రశేఖర్ అలియాస్ చింటూ, మోహన్ మధ్య కుటుంబ కలహాలు రేగాయి. దీనికిసైతం కొందరు అధికారపార్టీ నేతలే బీజం వేశారనే ప్రచారముంది. తరువాత పార్టీలోని కఠారి వ్యతిరేకవర్గం మామాఅల్లుళ్ల మధ్య ఆజ్యంపోసి విభేదాలు తారస్థాయికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతోంది. మూడున్నరేళ్ల అధికారం ఉంది.. మామపోతే అధికారం నీదే, ఆధిపత్యం నీదేనంటూ చింటూను రెచ్చగొట్టినట్లు సమాచారం. ఇలాగే వదిలేస్తే రాబోయే మూడేళ్లలో మీ మామ మరింత ఎదుగుతారని, ఆపై ఎమ్మెల్యే అయినా ఆశ్యర్యపడాల్సిందిలేదని, అదే జరిగితే అత్త కుటుంబానిదే పెత్తనమంటూ రెచ్చగొట్టినట్లు, నీ వెనుక మేముంటామంటూ వారు భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో మేనమామ కుటుంబంపై దాడికి చింటూ తెగబడినట్లు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. అధికారపార్టీ నేతల అండలేకుండా చింటూ హత్యాకాండకు దిగేంత సాహసం చేయలేడని రాజకీయవర్గాలతోపాటు కఠారి వర్గం సైతం భావిస్తున్నట్లు సమాచారం. కుట్రకోణంపై పోలీసు విచారణ కఠారి దంపతుల హత్యపై పోలీసు, నిఘా విభాగాలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. కఠారి కుటుంబంతో అధికారపార్టీలో ఎవరెవరికి విభేదాలున్నాయి? వారిలో హత్యను ప్రోత్సహించిందెవరు? చింటూకు భరోసా కల్పించిందెవరు? సహకరించిందెవరు? అన్నకోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విభేదాలకు సంబంధించి కఠారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, అనుచరులు, కొందరు అధికారపార్టీ నేతలనుసైతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే మోహన్‌ను హత్యచేసేందుకు సొంత పార్టీలో ఎవరు కుట్ర పన్నారన్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సీఎంకు మినహా ఏ ఒక్కరికీ బహిర్గతం చేయరాదని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసిన ట్లు విశ్వసనీయ సమాచారం. -
ఇంటెలిజెన్స్ వైఫల్యం - చంద్రబాబు
చిత్తూరు: ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం వల్లే చిత్తూరు మేయర్ దంపతుల హత్యోదంతం చోటుచేసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుట్రను ముందుగా గుర్తించివుంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యలు జరిగియన్నారు. హత్యాస్థలిని క్షుణ్నంగా పరిశీలించినట్టు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు దొరకాల్సివుందని వెల్లడించారు. హత్యారాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దుండగుల దాడిలో హత్యకు గురైన మేయర్ కఠారి అనురాధ, మోహన్ భౌతిక కాయాలకు చంద్రబాబు నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. -
ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే...: చంద్రబాబు
-
మేయర్ భర్త కూడా మృతి
చిత్తూరు: చిత్తూరులో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో మేయర్ అనూరాధపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాత్రి సమయంలో మృతి చెందారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను, మరో వ్యక్తి చిత్తూరు కోర్టులోను లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. -
స్పృహలోకి వచ్చిన మేయర్ భర్త
చిత్తూరు: చిత్తూరులో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తమిళనాడు వేలూరులోని సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన 1.30 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను, మరో వ్యక్తి చిత్తూరు కోర్టులోను లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో మేయర్ అనూరాధపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. -
చిత్తూరు మేయర్ భర్త మృతి
చిత్తూరు: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్ మరణించారు. వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ తుది శ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. వేలూరుకు తీసుకెళ్లిన కాసేపటికే మోహన్ చనిపోయారు. -
బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!
మేయర్ కఠారి అనూరాధ ప్రతిరోజూ ఉదయం 10-10.30 గంటలకే కార్పొరేషన్ కార్యాలయానికి వస్తారు. ఈ విషయం బాగా తెలిసిన ఆరుగురు దుండగులు మంగళవారం నాడు జనంలో కలిసిపోయి వచ్చారు. బయట దాదాపు 50 మంది వరకు ఉన్నారు. మేయర్‌కు ఎలాంటి పోలీసు భద్రత లేదు. ఆమె కోసం ఎవరు వచ్చినా నేరుగా లోపలకు పంపేస్తున్నారు. ఈ విషయాన్ని దుండగులు బాగా కనిపెట్టారు. అనూరాధను అభినందించాలంటూ ఆరుగురు వ్యక్తులు బురఖాలు ధరించి బొకేలతో వచ్చారు. వచ్చినవాళ్లు మహిళలని భావించి, వాళ్లను లోనికి పంపారు. లోపల మేయర్, ఆమె భర్త కఠారి మోహన్, దాదాపు 8 మంది వరకు కార్పొరేటర్లు ఉన్నారు. లోపలకు వెళ్లగానే వాళ్లు ముసుగులు తీసి, నేరుగా మేయర్ మీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. ఆమెకు నుదుటి మీద, కంటి కింద బుల్లెట్లు తగిలాయి. అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయిన ఆమె.. ఘటనాస్థలంలోనే మరణించారు. వెంటనే మేయర్ భర్త కఠారి మోహన్‌పై పొడవాటి కత్తులతో విరుచుకుపడ్డారు. ఆయన మెడ వెనకభాగంలో కూడా నరకడంతో నరాలు తెగిపోయాయి. గతంలో కూడా మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను తొలుత చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి వెల్లూరు సీఎంసీకి తరలించారు. ఛాంబర్లో ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి. మేయర్‌కు భద్రత కోసం కేవలం వ్యక్తిగత అనుచరులు ఉన్నారే తప్ప పోలీసులు మాత్రం ఎవరూ లేరు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు కార్పొరేషన్‌కు చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
చిత్తూరులో ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతులపై దాడి జరగడంతో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నగరంలో 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో రత్న సంఘటనా స్థలాన్నిపరిశీలించారు. సంఘటనాస్థలంలో దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మేయర్ కఠారి అనురాధను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన నలుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనూరాధతో పాటు ఉన్న భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాడిలో చిత్తూరుకు చెందిన ఓ కార్పొరేటర్ తమ్ముడికి కూడా తీవ్రగాయాలయినట్లు తెలిసింది. -
చిత్తూరు మేయర్ అనురాధ హత్య
-
చిత్తూరు మేయర్ దారుణ హత్య
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆయనను రాయవెల్లూరులోని సీఎంసీకి తరలించారు. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 8 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. దుండగులంతా 25-35 ఏళ్ల మధ్య వయసువాళ్లేనని ప్రత్యక్ష సాక్షి లోకనాథం 'సాక్షి'కి తెలిపారు. తర్వాత అందరూ ద్విచక్ర వాహనాలపై పారిపోయారని, అలా వెళ్లేటప్పుడు మూడు బురఖాలు, ఒక రివాల్వర్ కింద పడిపోయాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో కఠారి మోహన్ ప్రధాన నిందితుడు. గతంలో ఆయన కర్ణాటకలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తన భార్యను మేయర్‌గా చేసుకున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూపు వ్యతిరేకించింది. అయితే తాను చాలాకాలం పార్టీ కోసం కష్టపడ్డానని, భద్రతా కారణాల రీత్యా కూడా ఆ పదవి కావాలని పట్టుబట్టి మరీ భార్యను మేయర్ చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి పార్టీలోని ఒక గ్రూపు మాత్రం మోహన్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. మేయర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కుటుంబ కలహాలు కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు. -
చిత్తూరు టీడీపీలో వర్గపోరు
నేడు హైదరాబాద్‌కు కటారి వర్గీయులు అసెంబ్లీ టికెట్టుపైనే గురి సాక్షి, తిరుపతి : చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో విబేధాలు ముదురుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఇక్కడ నుంచి టికెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ కటారి మోహన్‌ను రంగంలోకి దించుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు తనకే ఇవ్వాలన్న డిమాండ్‌తో మోహన్ తన వర్గీయులతో కలిసి మూడు బస్సుల్లో మంగళవారం రాత్రి రాజధానికి బయలుదేరనున్నారు. మరుసటి రోజున అధినేత చంద్రబాబును కలసి విజ్ఞప్తి చేసేందుకు వారు సన్నద్ధమయ్యారు. మోహన్‌తో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పం చ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వెళ్తున్నట్టు సమాచారం. చిత్తూరు నేతలు చంద్రబాబు దగ్గర బలప్రదర్శనకు దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో టీడీపీని వదిలి ప్రజారాజ్యం పార్టీ టికెట్టుతో పోటీ చేసిన జంగాలపల్లి శ్రీనివాసులు తిరిగి పార్టీలోకి పునరాగమనంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే సామాజిక సమీకరణల్లో జంగాలపల్లి అవసరం ఉందని అప్పట్లో చంద్రబాబు చిత్తూరు నేతలను ఒప్పించారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్ష పదవినీ కట్టబెట్టారు. ఇది జీర్ణించుకోలేని మరో సామాజికవర్గం నేతలు అప్పటి నుంచి జేఎంసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒక దశలో ఇవి ముది రిపాకాన పడటం, పార్టీ పరిశీలకుల సమక్షంలోనే రచ్చ కావడంతో కొందరి పార్టీ పదవుల కు కూడా ముప్పు వచ్చింది. అయితే ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న సామెతగా జంగాలపల్లి శ్రీనివాసులు సామాజికవర్గం నేతలతో నే ఇప్పుడు ఢీ కొట్టిస్తున్నారు. చిత్తూరులో ఆ సామాజికవర్గానికి చెందిన ఓట్లు గణనీయం గా ఉన్నాయి. మాజీ కౌన్సిలర్ కటారి మోహన్‌కు చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆశీస్సు లు కూడా ఉండడంతో చిత్తూరు టీడీపీ నాయకులు కొందరు ఆయనను ప్రోత్సహిస్తున్నా రు. మొత్తానికి తమ వాదంతో పాటు జేఎం సీకి ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు కటారి ప్రయత్నిస్తున్నారు. ఈ పంచాయితీకి ఎటువంటి ముగింపు వస్తుందనేది నేతల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.