పరంధామ ఇంట్లో ల్యాప్ టాప్ పరిశీలిస్తున్న పోలీసులు
చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతడితో ఆర్థిక లావాదేవీలు ఉన్న 11 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింటూ సంబంధించిన ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అతడికి చిత్తూరుతో పాటు కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.
చింటూకు అత్యంత సన్నిహితులైన పరంధామ, హరిదాసు, హరిదాస్, మొగిలి, వెంకటేశ్, ప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోహన్ ను నరికిన కత్తిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ను దుండగులు ఈనెల 17న దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మోహన్ మేనల్లుడు చింటూ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు.