ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ | chittoor mayor murder case under trial says by district SP Srinivas | Sakshi
Sakshi News home page

ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ

Published Mon, Dec 14 2015 11:38 AM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ - Sakshi

ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ

చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్యను తానే చేసినట్లు ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకొన్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

మేయర్‌ దంపతులను హత్య చేసేందుకు చింటూ ఆరు నెలల ముందే ప్రణాళిక రచించాడని...గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సిందని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణ కొనసాగుతుందని అందులో భాగంగా మరో 12 మందిని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement