SP Srinivas
-
అనంత కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని చెబుతున్న మహిళ గురించి ఆమె బంధువుల మాటల్లో..
-
కోడిపల్లి ఘటనపై అనుమానాలున్నాయ్: అనంత ఎస్పీ
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని, దళిత మహిళపై వైకాపా నాయకుల దాష్టీకమంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు వండివార్చాయి. దీంతో ఎల్లో మీడియా కథనాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. కోడిపల్లి ఘటనపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలున్నాయని తెలిపారు. ‘‘కళ్యాణదుర్గం మండలం కోడిపల్లి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధం లేదు. కొందరు కావాలనే బాధితులను తప్పు దారి పట్టించి.. లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు. ఫోన్లో వీడియోలు లేవు ఏడాది క్రితం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార సమయంలో విడియోలు తీశారని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫోన్ లో ఎలాంటి విడియోలు లేవు. పైగా బాధిత మహిళ ఓ వ్యక్తితో ఉండగా.. గదికి తలుపులు వేసి కోడిపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ప్రవర్తనపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి అని ఎస్పీ వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు బాధిత మహిళ ఈనెల 10వ తేదీన ఒక రకంగా.. 14 తేదీన మరోలా ఫిర్యాదు చేసింది. కోడిపల్లికి మహిళ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కోడిపల్లి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలకు ఎస్పీ తెలియజేశారు. -
గెలుపోటములు సహజం
నల్లగొండ టూటౌన్ : క్రీడల్లో గెపోటములు సహజమని నల్లగొండ ఎస్పీ శ్రీని వాసరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్ డోర్ స్టేడియంలో నల్లగొండ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను శుక్రవారం ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడలకు మరింత చేరువ కావల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడల వల్ల కలిగే లాభాలు, గుర్తింపు తదితర విషయాలను క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలలన్నారు. పట్టుదలతో శిక్షకుల శిక్షణ తీసుకుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఎస్పీ పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్‌కుమార్, కూతురు ఫౌండేషన్ అధ్యక్షుడు కూతురు లక్ష్మారెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, శ్రీనివాస్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. మొదటి రోజు గెలుపొందిన జట్ల వివరాలు ⇒ ఖమ్మం జట్టుపై ఆదిలాబాద్ జట్టు 3–0 తో గెలుపు ⇒ వరంగల్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 5–0తో విజయం ⇒ వరంగల్ జట్టుపై హైదరాబాద్ జట్టు 6–0తో జయకేతనం ⇒ నల్లగొండ జట్టుపై మెదక్ జట్టు 8–1తో గెలుపు ⇒ ఖమ్మం జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 8–0 తో గెలుపు ⇒ రంగారెడ్డి జట్టుపై హైదరాబాద్ జట్టు 1–0 తో గెలుపు ⇒ వరంగల్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు 2–1తో గెలుపు ⇒ కరీంనగర్ జట్టుపై నల్లగొండ జట్టు 2–1 తో గెలుపు ⇒ రంగారెడ్డి జట్టుపై మెదక్ జట్టు 5–0 తో గెలుపు డిండిలో.. డిండి : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న నాల్గో జోనల్‌స్థాయి క్రీడాపోటీలు శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా రెండో రోజు జరిగిన 1500 మీటర్ల అండర్–19 రన్నింగ్ ఫైనల్ పోటీల్లో మొదటి విజతగా సరిత(డిండి), నందిని( నల్లకంచ), చంద్రకళ(మర్రికల్) ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. షాట్‌పుట్ ఫైనల్స్ అండర్–19 విభాగంలో విజేతగా నాగమణి(కోకట్), రెండో స్థానంలో శిరిష( మఠంపల్లి), తృతీయ స్థానంలో వెంకటేశ్వరమ్మ( కమ్మదనం), లాంగ్ జంప్ ఫైనల్స్ అండర్–17 విభాగంలో విజేతగా మాయావతి( డిండి), ద్వితీయ స్థానంలో శ్రావణి(తెల్కపల్లి), తృతీయ స్థానంలో మహితా(కమ్మదనం) నిలిచారు. క్రీడలతో మానసికోల్లాసం దామరచర్ల(మిర్యాలగూడ) : క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే భాస్కర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి(నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలు) గురుకుల బాలికల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి ప్రతిభగల్గిన క్రీడాకారులు గురుకులాల నుంచే తయారవుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, సురేష్‌నాయక్, ప్రసాద్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి
శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల పాటు అందిం చే శిక్షణకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయ న శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. 277 మంది జిల్లా అభ్యర్థులను హైదరాబాద్, వరంగల్ జి ల్లాలకు ప్రత్యేక బస్సులలో తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శిక్షణ పొందేందుకు గాను సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ విభాగంలో ఎంపికైన 250 మంది అభ్యర్థులు ఇక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. మే 1న ఉదయం 11 గంటలకు కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ చేతుల మీదుగా శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి కంప్యూటరీకరణతో అభ్యర్థులను తీర్చిదిద్ధేలా బోధన వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. అభ్యర్థులు ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణతో శిక్షణ పూర్తిచేసుకోవాలన్నారు. వృత్తినైపుణ్యాలు, క్రమశిక్షణ, దేహదారుఢ్యం, ప్రజలతో స్నేహసంబంధాలు, పోలీసు విధులు, చట్టంలోని అంశాలు తదితర విభా గాల్లో శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పనసారెడ్డి, శిక్షణ కేంద్రం డీఎస్పీ సీతా రాములు, ఆర్ఐ బి. జేమ్స్, సురేంద్ర, టూటౌన్ సీఐ వెంకటస్వామి, బోథ్ సీఐ జయరాం,పాల్గొన్నారు. -
హెడ్‌కానిస్టేబుళ్లకు 'సినిమా' సెలవు
హైదరాబాద్: సినిమా చూసేందుకు వీలుగా హెడ్‌కానిస్టేబుళ్లకు ఒక రోజు సెలవు మంజూరయింది. అరుదైన ఈ ఘటనకు ఆదిలాబాద్ జిల్లా వేదికైంది. జిల్లాలో పనిచేసే హెడ్‌కానిస్టేబుళ్లు ఇటీవల విడుదలైన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాను కుటుంబసభ్యులతో కలిసి చూసేందుకు వీలు కల్పిస్తూ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సెలవు మంజూరు చేశారు. జిల్లాలోని 230 హెడ్‌కానిస్టేబుళ్లకు ఉచితంగా సినిమా చూసే వీలు కల్పిస్తామని థియేటర్ల యజమానులు కూడా ప్రకటించారు. గురువారం రాత్రి షోను హెడ్‌కానిస్టేబుళ్లు కుటుంబసభ్యులతో కలిసి వీక్షించొచ్చని తెలిపారు. ఆర్.నారాయణమూర్తి సినిమాలో హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య పాత్రను పోషించారు. నిజాయితీ, ధైర్యం కలిగిన ఒక హెడ్‌కానిస్టేబుల్ చేసే మంచి పనుల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలయింది. -
క్రైమ్ ఫ్రీ జోన్‌గా చిత్తూరు
నేరాల్లో 30శాతం రోడ్డుప్రమాదాలే సీపీవోల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్) : చిత్తూరును క్రైమ్ ఫ్రీ జోన్‌గా మార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. శనివారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో ఏఎస్పీ అభిషేక్ మొహంతితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2016లో 3,970 కేసులు నమోదైతే, 3,099 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం నేరాల్లో 30 శాతాన్ని రోడ్డు ప్రమాదాలు ఆక్రమించడం ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు. జిల్లాలో 748 సీసీ కెమెరాలు, 37 హెచ్డీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఉంచామన్నారు. త్వరలోనే జాతీయ, రాష్ట్ర రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు కిడ్నాప్ గ్యాంగ్‌లను, విదేశాలకు మహిళల్ని తరలించే ముఠాలను సైతం కటకటాల్లోకి పంపించామన్నారు. డయల్–100కు మంచి స్పందన వస్తోందని, 2016లో 23,872 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థలో రెండో విడతగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎవరైనా మృతి చెందితే ఐడీఎఫ్ (ఇమీడియట్ డెత్ రిలీఫ్ ఫండ్)ను రాష్ట్రంలో మొదటిసారిగా చిత్తూరులోనే ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల కోసం ప్రత్యేక క్యాంటీన్లు, స్టోర్లు ప్రారంభించామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఆరోపణలపై పది మందిని పోలీ సు శాఖ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో 107 కేసులు నమోదు చేసి 324 మందిని అరెస్టు చేశామన్నారు. 36,618 కిలోల బరువున్న 1,698 దుంగల్ని, 108 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.16.19 కోట్లు ఉంటుందని చెప్పారు. అలాగే 17 మందిపై రౌడీషీట్లు, 26 మందిపై అనుమానిత షీట్లు తెరచామన్నారు. డీఎస్పీలు శ్రీకాంత్, సూర్యనారాయణ, సీఐ వెంకటప్ప, ఎస్ఐ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. -
మీడియా సహయంతో ఉత్తమమైన పోలీసింగ్
-
‘సాక్షి’ విలేకరి దేవిదాస్‌కు రాష్ట్రస్థాయి బహుమతి
అభినందించిన ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ‘సాక్షి’ క్రైం రిపోర్టర్ రొడ్డ దేవిదాస్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వార్తా సేకరణ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా విలేకరులు కథనాలను పంపించగా, డీజీపీ కార్యాలయ ఎంపిక కమిటీ 70 మందిని ఎంపిక చేసింది. ఇందులో 3 కథనాలు దేవిదాస్ రాసినవే. జిల్లాలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలపై కథనాలు రాశారు. ఇందుకుగాను రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిని దేవిదాస్‌కు ప్రకటిం చారు. గురువారం దేవిదాస్‌ను ఎస్పీ ఎం.శ్రీనివాస్ అభినందించారు. శుక్రవారం నగరంలోని గోషామహల్ పోలీసు పరేడ్ మైదానంలో బహుమతిని అందుకోనున్నారు. -
ఆ హత్యలు చేసింది చింటూనే : ఎస్పీ
చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్యను తానే చేసినట్లు ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఒప్పుకొన్నాడని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యకు ఆర్థిక, కుటుంబ తగాదాలే ప్రధాన కారణమని తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. మేయర్ దంపతులను హత్య చేసేందుకు చింటూ ఆరు నెలల ముందే ప్రణాళిక రచించాడని...గతంలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవాల్సిందని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణ కొనసాగుతుందని అందులో భాగంగా మరో 12 మందిని విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
యాలాల ఎస్సైది ఆత్మహత్యే
తాండూరు(రంగారెడ్డి): గత వారం రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్న యాలాల ఎస్సై రమేష్‌ది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే రమేష్ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలిందని.. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం రమేష్‌ది ఆత్మహత్యే అని వైద్యులు నిర్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. -
7 టెలికాం సర్వీస్ ప్రతినిధులను విచారించిన సిట్
-
7 టెలికాం సర్వీస్ ప్రతినిధులను విచారించిన సిట్
విజయవాడ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్‌పై కృష్ణా జిల్లా భవానీపురంలోని పోలీస్ స్టేషన్లో రెండో విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏడు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను విచారించినట్లు సిట్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మరొకరిని విచారిస్తున్నట్లు చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని సిట్ ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏపీ మంత్రుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
వారధిగా నిలుస్తా..
ఆయన జిల్లా పోలీసు బాస్.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారి.. కానీ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నడుంబిగించారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు.. అధికారులకు మధ్య వారధిగా నిలిచేందుకు సమాయత్తమయ్యారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పర్యటించారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాలనీలో కలియతిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాలనీలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ⇒ రాజీవ్ గృహకల్ప సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా ⇒ వాటి పరిష్కారానికి కృషి చేస్తా ⇒ కాలనీవాసుల అభివృద్ధికి తోడ్పడతా.. ఎస్పీ శ్రీనివాస్ హామీలు.. ⇒ రాజీవ్‌గృహకల్ప కాలనీలో మొక్కలు నాటించి నందనవనంగా మారుస్తా.. ⇒ కాలనీలో త్వరలో మెడికల్ క్యాంపు ఏర్పాటు ⇒ జిల్లాలో నేరాల అదుపునకు కృషి ⇒ శాంతి భద్రతలను కాపాడేందుకు పాటుపడతా ⇒ రాత్రి పూట గస్తీ పెంచుతా ఎస్పీ: మీ కాలనీలో ఉన్న సవుస్యలేమిటి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. ఇక్కడ ప్రధానంగా మంచి నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేదు. దుర్వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: రోడ్లు బాగానే ఉన్నాయి కదా? ఆర్జీకే కాలనీ వాసులు: ఈ మధ్యనే సీసీ రోడ్లు వేశారు. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎస్పీ: చెత్తాచెదారం ఇళ్ల ముందు వేస్తే ఎలా..రోగాలు రావా? ఆర్జీకే కాలనీ వాసులు: చెత్త కుండీలు ఏర్పాటు చేయించండి సార్.. చెత్తను కుండీల్లోనే వేస్తాం. ఎస్పీ: సబ్ కలెక్టర్ వర్షిణితో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేరుుస్తా. దేవేందర్ : సార్.. వూ కాలనీలో శ్మశానవాటికను ఏర్పాటు చేయించండి. ఎస్పీ: సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం చూపిస్తా. లక్ష్మయ్య: రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచండి సార్. ఎస్పీ: రోజు నుంచే ఆ పని చేయిస్తా.. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తెండి. రాజు: మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి.. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్పీ: ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి ఇప్పుడే చర్యలు తీసుకుంటా. దేవేందర్: ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపించండి. ఇక్కడి నుంచి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎస్పీ: డీఎస్పీతో మాట్లాడి ఇప్పటికిప్పుడే బారికేడ్లు పెట్టించి.. ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపిస్తాం. ఎస్పీ: మీరంతా ఓ సొసైటీగా ఏర్పడి స్వచ్ఛభారత్‌లో పాలుపంచుకోండి. మొక్కలు నాటండి. నేను ఇప్పిస్తా. ఆర్జీకే కాలనీ వాసులు: తప్పకుండా మొక్కలు నాటుతాం. ఎస్పీ: అమ్మాయిలు, మహిళలను ఎవరైనా వేధిస్తున్నారా? అలాంటివారెవరైనా ఉంటే చెప్పండి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. వేధింపులు ఏమీ లేవు. కానీ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో కాలనీలోకి వస్తుంటారు. ఎస్పీ: రాత్రివేళ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పోలీసులకు బీట్లు కూడా వేస్తాం నరేష్: సార్.. ఆర్జీకేను మున్సిపాలిటీకి అప్పగించేలా చూడండి. ఎక్కడ చూసినా మురుగు వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: సంబంధిత అధికారులతో ఇప్పుడే మాట్లాడతా. హర్షా బేగం: సార్.. ఇక్కడ దుర్వాసనకు రోగాలు వస్తున్నాయి. వైద్యం చేసే వారు లేరు. ఎస్పీ: వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తా. ఓ ఆరోగ్య కార్యకర్తను ఇక్కడే నియమించి కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా చూస్తా. లక్ష్మమ్మ: బకాయిల కోసం బ్యాంకర్లు వే ధిస్తున్నారు. ఎస్పీ: మరి బాకీ డబ్బులు కట్టాలి కదా. విడతల వారిగా చెల్లించే వెసులుబాటు చేస్తా. లక్ష్మమ్మ: మురుగంతా ఇళ్లముందే పారుతోంది. ఎస్పీ: మున్సిపల్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయిస్తా. అభినందనీయం సామాజిక బాధ్యతలో ‘సాక్షి’ ముందు వరుసలో నిలవడం అభినందనీయుం. ఇలాంటి మంచి కార్యక్రవుం చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘సాక్షి’ చొరవతో ఈరోజు రాజీవ్‌గృహకల్ప కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అన్ని శాఖల అధికారులతో వూట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా నావంతు ప్రయత్నం చేస్తా. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా. - ఎస్పీ శ్రీనివాస్