యాలాల ఎస్సైది ఆత్మహత్యే | ramesh death is a suicide, says SP srinivas | Sakshi
Sakshi News home page

యాలాల ఎస్సైది ఆత్మహత్యే

Published Sun, Sep 20 2015 7:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

యాలాల ఎస్సైది ఆత్మహత్యే - Sakshi

యాలాల ఎస్సైది ఆత్మహత్యే

తాండూరు(రంగారెడ్డి): గత వారం రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్న యాలాల ఎస్సై రమేష్‌ది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే రమేష్ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలిందని.. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం రమేష్‌ది ఆత్మహత్యే అని వైద్యులు నిర్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement