![Yellow Media Fake Stories Kodipalli Incident Anantapur SP Clarity - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/15/ATP-SP-02.jpg.webp?itok=5DO0XYdt)
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని, దళిత మహిళపై వైకాపా నాయకుల దాష్టీకమంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు వండివార్చాయి. దీంతో ఎల్లో మీడియా కథనాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. కోడిపల్లి ఘటనపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలున్నాయని తెలిపారు.
‘‘కళ్యాణదుర్గం మండలం కోడిపల్లి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధం లేదు. కొందరు కావాలనే బాధితులను తప్పు దారి పట్టించి.. లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు.
ఫోన్‌లో వీడియోలు లేవు
ఏడాది క్రితం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార సమయంలో విడియోలు తీశారని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫోన్ లో ఎలాంటి విడియోలు లేవు. పైగా బాధిత మహిళ ఓ వ్యక్తితో ఉండగా.. గదికి తలుపులు వేసి కోడిపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ప్రవర్తనపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి అని ఎస్పీ వెల్లడించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
బాధిత మహిళ ఈనెల 10వ తేదీన ఒక రకంగా.. 14 తేదీన మరోలా ఫిర్యాదు చేసింది. కోడిపల్లికి మహిళ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కోడిపల్లి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలకు ఎస్పీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment