సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి | Rayalaseema rajdhani sadhana committee Demand | Sakshi
Sakshi News home page

సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి

Published Thu, Jun 26 2014 12:18 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి - Sakshi

సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి

కళ్యాణదుర్గం: రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అభివృద్ధి కొన్ని జిల్లాలకే పరిమితం అయితే మళ్లీ వేర్పాటు ఉద్యమం రగిలే ప్రమాదం ఉందన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో  ‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థినులు, కమిటీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి  మానవహారంగా ఏర్పడ్డారు.

అంతకు ముందు ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ దేశం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. రాజధాని కోసం గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాలలో కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమకు తిరిగి అన్యాయం జరుగుతుందన్నా రు. 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేపట్టాలన్నారు. ఈ విషయంలో రాయలసీమ ప్రజా ప్రతినిధులు గళం విప్పాలని,శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే నాయకులు రాజధాని నిర్ణయం గురించి మాట్లాడడం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement