హెడ్‌కానిస్టేబుళ్లకు 'సినిమా' సెలవు
Published Thu, Jan 19 2017 7:16 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
హైదరాబాద్: సినిమా చూసేందుకు వీలుగా హెడ్‌కానిస్టేబుళ‍్లకు ఒక రోజు సెలవు మంజూరయింది. అరుదైన ఈ ఘటనకు ఆదిలాబాద్ జిల్లా వేదికైంది. జిల్లాలో పనిచేసే హెడ్‌కానిస్టేబుళ్లు ఇటీవల విడుదలైన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాను కుటుంబసభ్యులతో కలిసి చూసేందుకు వీలు కల్పిస్తూ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సెలవు మంజూరు చేశారు.
జిల్లాలోని 230 హెడ్‌కానిస్టేబుళ్లకు ఉచితంగా సినిమా చూసే వీలు కల్పిస్తామని థియేటర్ల యజమానులు కూడా ప్రకటించారు. గురువారం రాత్రి షోను హెడ్‌కానిస్టేబుళ్లు కుటుంబసభ్యులతో కలిసి వీక్షించొచ్చని తెలిపారు. ఆర్.నారాయణమూర్తి సినిమాలో హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య పాత్రను పోషించారు. నిజాయితీ, ధైర్యం కలిగిన ఒక హెడ్‌కానిస్టేబుల్ చేసే మంచి పనుల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలయింది.
Advertisement
Advertisement