
‘సాక్షి’ విలేకరి దేవిదాస్‌కు రాష్ట్రస్థాయి బహుమతి
అభినందించిన ఎస్పీ శ్రీనివాస్
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ‘సాక్షి’ క్రైం రిపోర్టర్ రొడ్డ దేవిదాస్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వార్తా సేకరణ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా విలేకరులు కథనాలను పంపించగా, డీజీపీ కార్యాలయ ఎంపిక కమిటీ 70 మందిని ఎంపిక చేసింది. ఇందులో 3 కథనాలు దేవిదాస్ రాసినవే.
జిల్లాలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలపై కథనాలు రాశారు. ఇందుకుగాను రాష్ట్రస్థాయిలో ప్రోత్సాహక బహుమతిని దేవిదాస్‌కు ప్రకటిం చారు. గురువారం దేవిదాస్‌ను ఎస్పీ ఎం.శ్రీనివాస్ అభినందించారు. శుక్రవారం నగరంలోని గోషామహల్ పోలీసు పరేడ్ మైదానంలో బహుమతిని అందుకోనున్నారు.