విజయవాడ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్పై కృష్ణా జిల్లా భవానీపురంలోని పోలీస్ స్టేషన్లో రెండో విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏడు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను విచారించినట్లు సిట్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మరొకరిని విచారిస్తున్నట్లు చెప్పారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని సిట్ ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏపీ మంత్రుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.