ఫోన్ ట్యాపింగ్ పై ఏపీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజుల పాటు చేపట్టిన విచారణ ముగిసింది.
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ పై ఏపీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజుల పాటు చేపట్టిన విచారణ ముగిసింది. మొత్తం 8 మంది టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులను విచారించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విచారణ కొనసాగింది. ఈరోజు మూడు టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులను ప్రశ్నించారు.
నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు విచారణ కొనసాగింది. న్యాయనిపుణులతో కలిసి టెలికం సర్వీసు ప్రొవైడర్ల ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. దాదాపు 16 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ ముగిసిన తర్వాత టెలికం సంస్థల ప్రతినిధులు ఎవరితోనూ మాట్లాడలేదు.