వారధిగా నిలుస్తా.. | SP Srinivas Sakshi VIP Reporter | Sakshi
Sakshi News home page

వారధిగా నిలుస్తా..

Published Mon, Feb 9 2015 5:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

వారధిగా నిలుస్తా.. - Sakshi

వారధిగా నిలుస్తా..

ఆయన జిల్లా పోలీసు బాస్.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారి.. కానీ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నడుంబిగించారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు.. అధికారులకు మధ్య వారధిగా నిలిచేందుకు సమాయత్తమయ్యారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పర్యటించారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాలనీలో కలియతిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాలనీలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


రాజీవ్ గృహకల్ప సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా   
వాటి పరిష్కారానికి కృషి చేస్తా
కాలనీవాసుల అభివృద్ధికి తోడ్పడతా..


ఎస్పీ శ్రీనివాస్ హామీలు..
రాజీవ్‌గృహకల్ప కాలనీలో మొక్కలు నాటించి నందనవనంగా మారుస్తా..
కాలనీలో త్వరలో మెడికల్ క్యాంపు ఏర్పాటు  
జిల్లాలో నేరాల అదుపునకు కృషి
శాంతి భద్రతలను కాపాడేందుకు పాటుపడతా
రాత్రి పూట గస్తీ పెంచుతా


ఎస్పీ: మీ కాలనీలో ఉన్న సవుస్యలేమిటి?
ఆర్‌జీకే కాలనీ వాసులు: సార్.. ఇక్కడ ప్రధానంగా మంచి నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేదు. దుర్వాసన భరించలేక పోతున్నాం.
 
ఎస్పీ:
రోడ్లు బాగానే ఉన్నాయి కదా?
ఆర్‌జీకే కాలనీ వాసులు:  ఈ మధ్యనే సీసీ రోడ్లు వేశారు. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బయటికి రావాలంటే భయంగా ఉంది.
 
ఎస్పీ: చెత్తాచెదారం ఇళ్ల ముందు వేస్తే ఎలా..రోగాలు రావా?
ఆర్‌జీకే కాలనీ వాసులు:  చెత్త కుండీలు ఏర్పాటు చేయించండి సార్.. చెత్తను కుండీల్లోనే వేస్తాం.
 
ఎస్పీ: సబ్ కలెక్టర్ వర్షిణితో మాట్లాడి  వెంటనే ఏర్పాటు చేరుుస్తా.
దేవేందర్ : సార్.. వూ కాలనీలో శ్మశానవాటికను ఏర్పాటు చేయించండి.
 
ఎస్పీ: సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం చూపిస్తా.
లక్ష్మయ్య: రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచండి సార్.
 
ఎస్పీ: రోజు నుంచే ఆ పని చేయిస్తా.. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తెండి.
రాజు: మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి.. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
 
ఎస్పీ: ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి ఇప్పుడే చర్యలు తీసుకుంటా.
దేవేందర్: ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపించండి. ఇక్కడి నుంచి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
ఎస్పీ: డీఎస్పీతో మాట్లాడి ఇప్పటికిప్పుడే బారికేడ్లు పెట్టించి.. ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపిస్తాం.
ఎస్పీ: మీరంతా ఓ సొసైటీగా ఏర్పడి స్వచ్ఛభారత్‌లో పాలుపంచుకోండి. మొక్కలు నాటండి. నేను ఇప్పిస్తా.
ఆర్‌జీకే కాలనీ వాసులు: తప్పకుండా మొక్కలు నాటుతాం.
 
ఎస్పీ: అమ్మాయిలు, మహిళలను ఎవరైనా వేధిస్తున్నారా? అలాంటివారెవరైనా ఉంటే చెప్పండి?
ఆర్‌జీకే కాలనీ వాసులు: సార్.. వేధింపులు ఏమీ లేవు. కానీ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో కాలనీలోకి వస్తుంటారు.
 
ఎస్పీ: రాత్రివేళ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పోలీసులకు బీట్లు కూడా వేస్తాం
నరేష్: సార్.. ఆర్జీకేను మున్సిపాలిటీకి అప్పగించేలా చూడండి. ఎక్కడ చూసినా మురుగు వాసన భరించలేక పోతున్నాం.
 
ఎస్పీ: సంబంధిత అధికారులతో ఇప్పుడే మాట్లాడతా.  
హర్షా బేగం: సార్.. ఇక్కడ దుర్వాసనకు రోగాలు వస్తున్నాయి. వైద్యం చేసే వారు లేరు.
 
ఎస్పీ: వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తా. ఓ ఆరోగ్య కార్యకర్తను ఇక్కడే నియమించి కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా చూస్తా.  
లక్ష్మమ్మ: బకాయిల కోసం బ్యాంకర్లు వే ధిస్తున్నారు.
 
ఎస్పీ: మరి బాకీ డబ్బులు కట్టాలి కదా. విడతల వారిగా చెల్లించే వెసులుబాటు చేస్తా.
లక్ష్మమ్మ: మురుగంతా ఇళ్లముందే పారుతోంది.
ఎస్పీ: మున్సిపల్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయిస్తా.  
 
అభినందనీయం
సామాజిక బాధ్యతలో ‘సాక్షి’ ముందు వరుసలో నిలవడం అభినందనీయుం. ఇలాంటి మంచి కార్యక్రవుం చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘సాక్షి’ చొరవతో ఈరోజు రాజీవ్‌గృహకల్ప కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అన్ని శాఖల అధికారులతో వూట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా నావంతు ప్రయత్నం చేస్తా. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా.  
 - ఎస్పీ శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement