District police boss
-
పంజాబ్‌కీ షాన్
సరిగ్గా 35 ఏళ్లు... చూడడానికి బక్కపలుచగా ఉన్నా ఆయన విజన్ చాలా బలీయమైనది.. తాను ఎక్కడ పనిచేసినా తనదైన మార్కు ఉండాల్సిందే.. ‘దుగ్గల్ సాబ్ ఉన్నప్పుడు’ అని అందరూ చెప్పుకోవాల్సిందే.. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో అంతర్జాతీయ అవార్డు కూడా సాధించారు. చదివింది ఇంజినీరింగ్ అయినా పోలీస్ కావాలన్నదే జీవితలక్ష్యం.. పోలీస్ ఉద్యోగమే ఆశ, శ్వాస.. పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన ఆయన దేశంలో ఎక్కడయినా పోలీస్‌గానే చేయాలని నిర్ణ యించుకున్నారు.. తన తాత, తండ్రిని ఆదర్శంగా తీసుకుని వారి బాటలోనే పయనించాలను కుని.. కచ్చితంగా పోలీసే కావాలన్న కలను నిజం చేసుకున్నారు జిల్లా పోలీస్‌బాస్ విక్రమ్‌జీత్ దుగ్గల్. ఆయన జీవిత విశేషాలపై సాక్షి అందిస్తున్న పత్యేక కథనం మీకోసం. సాక్షిప్రతినిధి నల్లగొండ మాది పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్సర్ జిల్లా కోట్భాయ్ అనే గ్రామం. అయితే మా తాతల కాలంలోనే ఫాజిల్కా జిల్లా అబోహర్ అనే పట్టణానికి వచ్చి స్థిరపడ్డాం. ఈ పట్టణం పాకిస్తాన్ దేశ సరిహద్దులో ఉంటుంది. మన రాష్ట్రంలోని రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల సరిహద్దు కూడా. అక్కడే నా బాల్యమంతా గడిచింది. అబోహర్‌లోని అమృత్ మోడల్ హైస్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా అదే పట్టణంలోని డీఏవీ కళాశాలలో పూర్తి చేశాను. ఆ తర్వాత జలంధర్‌లోని పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీటె క్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పూర్తి చేశాను. ఇంజనీరింగ్ 2002లో పూర్తయిన తర్వాత 2004లో సివిల్స్ పరీక్ష రాశాను. పోలీస్ కేరాఫ్ దుగ్గల్ ఫ్యామిలీ మా కుటుంబంలో పోలీసులుగా పనిచేయడం ఆనవాయితీగా వస్తోంది. మా తాత బాబూరామ్ దుగ్గల్, నాన్న కశ్మీరీలాల్ దుగ్గల్లిద్దరూ పోలీసులే. మాది వ్యవసాయ కుటుంబమే అయినా, మా తాత నేను వ్యవసాయం చేయను. పోలీసునవుతానని చెప్పి బ్రిటిష్ కాలంలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1984లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయనేమీ చదువుకోలేదు కూడా. మా నాన్న కశ్మీరీలాల్ కూడా కానిస్టేబులే. 1975లో పోలీసు విధుల్లో చేరిన ఆయన ఎస్ఐ హోదాలో 2007లో రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన సంవత్సరం బ్యాచ్ (2007 బ్యాచ్)లోనే నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. అంటే దాదాపు 60 ఏళ్లుగా మా కుటుంబం పోలీసు విధుల్లో ఉంది. మా ఊరు యుద్ధభూమి మా స్వగ్రామమైన ముక్త్సర్ జిల్లా యుద్ధభూమిగా పేరుగాంచింది. మొఘల్ సామ్రాజ్య కాలంలో ఇక్కడే మొఘల్ సైన్యానికి, సిక్కు సైనికులకు మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు 46 మంది సిక్కువీరులు అమరులయ్యారు. అందుకే ముక్త్సర్ అని పేరు వచ్చింది. ముక్త్ అంటే 46 అని పంజాబీలో అర్థం. అందుకే మా ఊరికి ఆ పేరు పెట్టారని అందరూ చెప్పుకుంటారు. నా రోల్‌మోడల్..నా ప్రొఫెసర్ స్ఫూర్తినిచ్చే వారి గురించి చెప్పాలంటే రంగాల వారీగా చాలా మంది ఉంటారు. కానీ మీ రోల్‌మోడల్ ఎవరని అడిగితే మాత్రం మా ప్రొఫెసర్ బి.బి.శర్మ అని చెప్పక తప్పదు. నేను డీఏవీ కళాశాలలో చదివినప్పుడు ఆయన మాకు కెమిస్ట్రీ చెప్పేవారు. మాకు కెమిస్ట్రీ పాఠాలు చెప్పిన తీరు అద్భుతం. ఒకవేళ నేను టీచర్ అయి ఉంటే ఆయనలాగానే ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కూడా ఆయనలాగానే పరిపూర్ణంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఆయన నా రోల్‌మోడల్. కమ్యూనిటీ పోలీసింగ్.. అవార్డు తెచ్చిపెట్టింది నేను విశాఖపట్నం రూరల్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు గాను మా టీంకు అంతర్జాతీయ అవార్డు వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓర్లాండో యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ (ఐఏసీపీ)లు సంయుక్తంగా ‘హోంల్యాండ్ సెక్యూరిటీ అవార్డు’ను ఇచ్చాయి. నాతో పాటు మా ఇన్స్పెక్టర్ కలిసి వెళ్లి అవార్డు స్వీకరించాం. అది చాలా సంతృప్తినిచ్చింది. విశాఖ రూరల్‌లో పనిచేస్తు న్నప్పుడే అన్ని రకాల ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి గ్రామపంచాయతీల వరకు జరిగిన ఈ ఎన్నికలను సమర్థంగా నిర్వహించగలిగామనే తృప్తి కలిగింది. ఇంజినీర్‌ను కాదు సార్... పోలీస్.. నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుపై కొంత శ్రద్ధ తగ్గిపోయింది. అప్పుడు మా ప్రొఫెసర్ నన్ను ప్రశ్నించారు. ఎందుకు ఎలక్ట్రానిక్స్‌లో మంచి ప్రతిభ కనబర్చలేకపోతున్నావు అని. అప్పుడు ‘నేను ఇంజనీర్‌ను కావాలనుకోవడం లేదు సార్.. పోలీస్‌నవుతా.’ అని చెప్పాను. అయితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఇంకా గుర్తుంది. నువ్వు పోలీస్ కావాలన్నా శ్రద్ధతో చదవాలి... దీనిపై శ్రద్ధ తగ్గితే ఆ సబ్జెక్టులపై కూడా శ్రద్ధ తగ్గుతుంది. అలా కాకుండా చూసుకోవాలని చెప్పారు. -
వారధిగా నిలుస్తా..
ఆయన జిల్లా పోలీసు బాస్.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారి.. కానీ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నడుంబిగించారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు.. అధికారులకు మధ్య వారధిగా నిలిచేందుకు సమాయత్తమయ్యారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పర్యటించారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాలనీలో కలియతిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, శ్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాలనీలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ⇒ రాజీవ్ గృహకల్ప సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తా ⇒ వాటి పరిష్కారానికి కృషి చేస్తా ⇒ కాలనీవాసుల అభివృద్ధికి తోడ్పడతా.. ఎస్పీ శ్రీనివాస్ హామీలు.. ⇒ రాజీవ్‌గృహకల్ప కాలనీలో మొక్కలు నాటించి నందనవనంగా మారుస్తా.. ⇒ కాలనీలో త్వరలో మెడికల్ క్యాంపు ఏర్పాటు ⇒ జిల్లాలో నేరాల అదుపునకు కృషి ⇒ శాంతి భద్రతలను కాపాడేందుకు పాటుపడతా ⇒ రాత్రి పూట గస్తీ పెంచుతా ఎస్పీ: మీ కాలనీలో ఉన్న సవుస్యలేమిటి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. ఇక్కడ ప్రధానంగా మంచి నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేదు. దుర్వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: రోడ్లు బాగానే ఉన్నాయి కదా? ఆర్జీకే కాలనీ వాసులు: ఈ మధ్యనే సీసీ రోడ్లు వేశారు. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎస్పీ: చెత్తాచెదారం ఇళ్ల ముందు వేస్తే ఎలా..రోగాలు రావా? ఆర్జీకే కాలనీ వాసులు: చెత్త కుండీలు ఏర్పాటు చేయించండి సార్.. చెత్తను కుండీల్లోనే వేస్తాం. ఎస్పీ: సబ్ కలెక్టర్ వర్షిణితో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేరుుస్తా. దేవేందర్ : సార్.. వూ కాలనీలో శ్మశానవాటికను ఏర్పాటు చేయించండి. ఎస్పీ: సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం చూపిస్తా. లక్ష్మయ్య: రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచండి సార్. ఎస్పీ: రోజు నుంచే ఆ పని చేయిస్తా.. ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తెండి. రాజు: మెయిన్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి.. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్పీ: ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి ఇప్పుడే చర్యలు తీసుకుంటా. దేవేందర్: ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపించండి. ఇక్కడి నుంచి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎస్పీ: డీఎస్పీతో మాట్లాడి ఇప్పటికిప్పుడే బారికేడ్లు పెట్టించి.. ఓవర్‌లోడ్ లారీలను బైపాస్ రోడ్డు నుంచి పంపిస్తాం. ఎస్పీ: మీరంతా ఓ సొసైటీగా ఏర్పడి స్వచ్ఛభారత్‌లో పాలుపంచుకోండి. మొక్కలు నాటండి. నేను ఇప్పిస్తా. ఆర్జీకే కాలనీ వాసులు: తప్పకుండా మొక్కలు నాటుతాం. ఎస్పీ: అమ్మాయిలు, మహిళలను ఎవరైనా వేధిస్తున్నారా? అలాంటివారెవరైనా ఉంటే చెప్పండి? ఆర్జీకే కాలనీ వాసులు: సార్.. వేధింపులు ఏమీ లేవు. కానీ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో కాలనీలోకి వస్తుంటారు. ఎస్పీ: రాత్రివేళ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పోలీసులకు బీట్లు కూడా వేస్తాం నరేష్: సార్.. ఆర్జీకేను మున్సిపాలిటీకి అప్పగించేలా చూడండి. ఎక్కడ చూసినా మురుగు వాసన భరించలేక పోతున్నాం. ఎస్పీ: సంబంధిత అధికారులతో ఇప్పుడే మాట్లాడతా. హర్షా బేగం: సార్.. ఇక్కడ దుర్వాసనకు రోగాలు వస్తున్నాయి. వైద్యం చేసే వారు లేరు. ఎస్పీ: వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తా. ఓ ఆరోగ్య కార్యకర్తను ఇక్కడే నియమించి కాలనీవాసులకు అందుబాటులో ఉండేలా చూస్తా. లక్ష్మమ్మ: బకాయిల కోసం బ్యాంకర్లు వే ధిస్తున్నారు. ఎస్పీ: మరి బాకీ డబ్బులు కట్టాలి కదా. విడతల వారిగా చెల్లించే వెసులుబాటు చేస్తా. లక్ష్మమ్మ: మురుగంతా ఇళ్లముందే పారుతోంది. ఎస్పీ: మున్సిపల్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయిస్తా. అభినందనీయం సామాజిక బాధ్యతలో ‘సాక్షి’ ముందు వరుసలో నిలవడం అభినందనీయుం. ఇలాంటి మంచి కార్యక్రవుం చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘సాక్షి’ చొరవతో ఈరోజు రాజీవ్‌గృహకల్ప కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అన్ని శాఖల అధికారులతో వూట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా నావంతు ప్రయత్నం చేస్తా. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా. - ఎస్పీ శ్రీనివాస్