దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్ మరణించారు.
చిత్తూరు: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్ మరణించారు. వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ తుది శ్వాస విడిచారు.
మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. వేలూరుకు తీసుకెళ్లిన కాసేపటికే మోహన్ చనిపోయారు.