బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి! | six people in burqas came with boquets and guns | Sakshi
Sakshi News home page

బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!

Published Tue, Nov 17 2015 1:46 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి! - Sakshi

బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!

మేయర్ కఠారి అనూరాధ ప్రతిరోజూ ఉదయం 10-10.30 గంటలకే కార్పొరేషన్ కార్యాలయానికి వస్తారు. ఈ విషయం బాగా తెలిసిన ఆరుగురు దుండగులు మంగళవారం నాడు జనంలో కలిసిపోయి వచ్చారు. బయట దాదాపు 50 మంది వరకు ఉన్నారు. మేయర్‌కు ఎలాంటి పోలీసు భద్రత లేదు. ఆమె కోసం ఎవరు వచ్చినా నేరుగా లోపలకు పంపేస్తున్నారు. ఈ విషయాన్ని దుండగులు బాగా కనిపెట్టారు. అనూరాధను అభినందించాలంటూ ఆరుగురు వ్యక్తులు బురఖాలు ధరించి బొకేలతో వచ్చారు. వచ్చినవాళ్లు మహిళలని భావించి, వాళ్లను లోనికి పంపారు. లోపల మేయర్, ఆమె భర్త కఠారి మోహన్, దాదాపు 8 మంది వరకు కార్పొరేటర్లు ఉన్నారు. లోపలకు వెళ్లగానే వాళ్లు ముసుగులు తీసి, నేరుగా మేయర్ మీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. ఆమెకు నుదుటి మీద, కంటి కింద బుల్లెట్లు తగిలాయి. అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయిన ఆమె.. ఘటనాస్థలంలోనే మరణించారు.

వెంటనే మేయర్ భర్త కఠారి మోహన్‌పై పొడవాటి కత్తులతో విరుచుకుపడ్డారు. ఆయన మెడ వెనకభాగంలో కూడా నరకడంతో నరాలు తెగిపోయాయి. గతంలో కూడా మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను తొలుత చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి వెల్లూరు సీఎంసీకి తరలించారు. ఛాంబర్‌లో ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి. మేయర్‌కు భద్రత కోసం కేవలం వ్యక్తిగత అనుచరులు ఉన్నారే తప్ప పోలీసులు మాత్రం ఎవరూ లేరు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు కార్పొరేషన్‌కు చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement