చిత్తూరు మేయర్ దంపతులపై కాల్పులు జరగడంతో నగరంలో 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతులపై దాడి జరగడంతో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నగరంలో 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో రత్న సంఘటనా స్థలాన్నిపరిశీలించారు. సంఘటనాస్థలంలో దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
మేయర్ కఠారి అనురాధను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన నలుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనూరాధతో పాటు ఉన్న భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాడిలో చిత్తూరుకు చెందిన ఓ కార్పొరేటర్ తమ్ముడికి కూడా తీవ్రగాయాలయినట్లు తెలిసింది.