
హత్యాస్థలిలో దొరికిన కత్తి
చిత్తూరు: మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఘటనా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హత్యాస్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ కేసులో కఠారి మోహన్ బావమరిది చింటూ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడికి వెంకటేశ్, వెంకటా చలపతి, రెడ్డప్ప, మంజునాథ్ సహకరించినట్టు తెలుస్తోంది. వెంకటేష్, మరో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.
మరోవైపు ఎస్పీ శ్రీనివాసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. నిందితులు జిల్లా దాటివెళ్లకుండా చూడాలని ఆదేశించారు. కాగా, మేయర్ హత్యతో చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు.