మహిళా మేయర్ హత్య దారుణం: చంద్రబాబు | chandrababu naidu condemn chittoor mayor murder | Sakshi
Sakshi News home page

మహిళా మేయర్ హత్య దారుణం: చంద్రబాబు

Published Tue, Nov 17 2015 2:58 PM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

మహిళా మేయర్ హత్య దారుణం: చంద్రబాబు - Sakshi

మహిళా మేయర్ హత్య దారుణం: చంద్రబాబు

విజయవాడ: చిత్తూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళా మేయర్ తన కార్యాలయంలో హత్యకు గురికావడం దారుణమన్నారు. కరడుకట్టిన ముఠాలు చేసిన పని ఇదని, ఇద్దరు లొంగిపోయారుని తెలిపారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరువున్నా రాజీ పడబోమని, రాజకీయ ముసుగులో ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని చంద్రబాబు అన్నారు.

చిత్తూరు మేయర్ కఠారి అనురాధను దుండగులు మంగళవారం కాల్చిచంపారు. ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. వీరిలో ఒకరు పలమనేరుకు చెందిన వెంకటేష్, మరొకరు ముల్ బాగల్(కర్ణాటక)కు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యాయత్నం  జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement