'అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 ఉండాలన్నాం' | enquiry is going on phone taping says ap dgp Ramudu | Sakshi
Sakshi News home page

'అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 ఉండాలన్నాం'

Published Tue, Jun 30 2015 2:22 PM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

'అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 ఉండాలన్నాం' - Sakshi

'అవసరం ఉంది కాబట్టే సెక్షన్-8 ఉండాలన్నాం'

విశాఖ:  ఓటుకు కోట్లు కేసులో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెక్షన్ 8  అవసరాన్ని నొక్కి చెబుతూ వ్యాఖ్యానించారు. అవసరం ఉంది కాబట్టే  సెక్షన్ 8 అమలును  కోరుతున్నా మని,  హైదరాబాద్లో సెక్షన్ 8  ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.   ఈ కేసులో  తెలంగాణ పోలీసులతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు.  


విశాఖలో చమురు, గ్యాస్ పైప్ లైన్ల భద్రతపై సమీక్ష నిర్వహించిన ఏపీ డీజీపీ రాముడు సెక్యూరిటీ  ఏజెన్సీలు, చమురు కంపెనీల సీఈవోలకు డీజీపీ రాముడు పలు సూచనలు,  సలహాలు ఇచ్చారు. ఉగ్రవాదుల నుంచి చమురు సంస్థలకు ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ, ప్రజలతో భాగస్వాములు కావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు.  టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని ఏపీ డీజీపి  రాముడు కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement