మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ పోలీసుల అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఏవోబీ ఎన్కౌంటర్ ఆర్కే లక్ష్యంగా జరగలేదని స్పష్టం చేశారు. ఏవోబీలో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసు బలగాలు కూంబింగ్కు వెళ్లాయని, మావోయిస్టులు ఎదురుకావడం వల్లే ఎదురుకాల్పులు జరిగాయని డీజీపీ వివరించారు.