బాబుపై హత్య కేసు ఎందుకు పెట్టలేదు?
- డీజీపీ సాంబశివరావుకు ముద్రగడ బహిరంగ లేఖ
- పుష్కరాల్లో 30 మంది భక్తులను చంద్రబాబు చంపారు
జగ్గంపేట: గోదావరి పుష్కరాల్లో తొక్కిస లాటలో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మ నాభం ప్రశ్నించారు. ఆయన రాష్ట్ర డీజీపీ సాంబశివరావుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లం పూడిలోని తన నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ముద్రగడ ఈ లేఖ విడుదల చేశారు. డీజీపీని ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ముఖ్య వివరాలు.. ‘‘కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి లేదని మీరు తెలిపారు. రాష్ట్రమంతా సెక్షన్-30 అమల్లో ఉందన్నారు.
గతంలో వివిధ నేతలు చేసిన పాదయాత్రలు, పార్టీల కార్యక్రమా లు, ఇతర కుల సోదరుల ర్యాలీలకు పర్మి షన్లు పొందారా? ఎవరికీ లేని పర్మిషన్లు నాకే కావాలా? గోదావరి పుష్కరాలకు సెక్యూరిటీ ఉన్న వీఐపీ ఘాట్‌లో కాకుండా, సామా న్యులకు కేటారుుంచిన ఘాట్‌లో సీఎం, వారి బంధుగణం స్నానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రపంచ వ్యాప్తంగా తెలియడాని కి వీడియో తీయడం కోసం భక్తులు కిక్కిరిసి ఉండగా 30 మందిని చంపివేశారు. సీఎం, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదు? ఈ కేసులో సీఎం ప్రధాన నిందితుడు కాబట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ధ్వంసం చేసిన ఘటన మీకు తెలియదా? చట్టాన్ని కాపాడాల్సిన మన పోలీసులు, సీఎం, వారి బంధుగణంపై హత్యానేరం కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. సదరు నేరంపై ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసి, నష్టపరిహారం వసూలు చేయాలి. తుని ఘటనతో నాకు, మా జాతికి ఎటువంటి సంబంధమూ లేదు. అరుునప్పటికీ మాపై పెట్టిన ఆరోపణలు రుజువైతే ఆ ఘటనలో జరిగిన ఆస్తినష్టానికి మా ఆస్తులు పబ్లిక్‌గా అమ్మి పరిహారం చెల్లిస్తాను’’ అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.