kapu satyagraha padayatra
-
బాబుపై హత్య కేసు ఎందుకు పెట్టలేదు?
- డీజీపీ సాంబశివరావుకు ముద్రగడ బహిరంగ లేఖ - పుష్కరాల్లో 30 మంది భక్తులను చంద్రబాబు చంపారు జగ్గంపేట: గోదావరి పుష్కరాల్లో తొక్కిస లాటలో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మ నాభం ప్రశ్నించారు. ఆయన రాష్ట్ర డీజీపీ సాంబశివరావుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లం పూడిలోని తన నివాసంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ముద్రగడ ఈ లేఖ విడుదల చేశారు. డీజీపీని ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ముఖ్య వివరాలు.. ‘‘కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి లేదని మీరు తెలిపారు. రాష్ట్రమంతా సెక్షన్-30 అమల్లో ఉందన్నారు. గతంలో వివిధ నేతలు చేసిన పాదయాత్రలు, పార్టీల కార్యక్రమా లు, ఇతర కుల సోదరుల ర్యాలీలకు పర్మి షన్లు పొందారా? ఎవరికీ లేని పర్మిషన్లు నాకే కావాలా? గోదావరి పుష్కరాలకు సెక్యూరిటీ ఉన్న వీఐపీ ఘాట్‌లో కాకుండా, సామా న్యులకు కేటారుుంచిన ఘాట్‌లో సీఎం, వారి బంధుగణం స్నానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రపంచ వ్యాప్తంగా తెలియడాని కి వీడియో తీయడం కోసం భక్తులు కిక్కిరిసి ఉండగా 30 మందిని చంపివేశారు. సీఎం, వారి కుటుంబ సభ్యులపైన హత్యా నేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయ లేదు? ఈ కేసులో సీఎం ప్రధాన నిందితుడు కాబట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ధ్వంసం చేసిన ఘటన మీకు తెలియదా? చట్టాన్ని కాపాడాల్సిన మన పోలీసులు, సీఎం, వారి బంధుగణంపై హత్యానేరం కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. సదరు నేరంపై ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసి, నష్టపరిహారం వసూలు చేయాలి. తుని ఘటనతో నాకు, మా జాతికి ఎటువంటి సంబంధమూ లేదు. అరుునప్పటికీ మాపై పెట్టిన ఆరోపణలు రుజువైతే ఆ ఘటనలో జరిగిన ఆస్తినష్టానికి మా ఆస్తులు పబ్లిక్‌గా అమ్మి పరిహారం చెల్లిస్తాను’’ అని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. -
సెక్షన్ 30 జీవితాంతం అమల్లో ఉంటుందా?: ముద్రగడ
కాకినాడ: సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ డీజీపీ సాంబశివరావును కోరారు. ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సన్నద్దమైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు. ఈ నేపధ్యంలో ముద్రగడ మంగళవారం డీజీపీ సాంబశివరావు కు లేఖ రాశారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తుని ఘటనలో తనపై, తన జాతిపై వస్తన్న ఆరోపణలు రుజవైతే ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తానని ముద్రగడ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని.. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా.. లేదా 2019 లో జరిగే ఎన్నికల వరకు అమలు చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. -
కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత
హైకోర్టు ఆమోదం తెలిపినా కూడా ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన స్వగృహం నుంచి కోనసీమ ముఖద్వారమైన రావులపాలేనికి బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఆయన కాపు సత్యాగ్రహ పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. చిట్టచివరి నిమిషంలో.. మంగళవారం నాడు హైకోర్టు ఆయన యాత్రకు ఆమోదం తెలిపింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఆ విషయాన్ని పోలీసులు చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కానీ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాల గురించి పట్టించుకోకుండా.. తమపని తాము చేసుకెళ్లిపోతున్నారు. పాదయాత్రను విరమించుకోవాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరిన పోలీసులు.. ఆయనను గృహనిర్బంధం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా యాత్రను వాయిదా వేసుకోవాలని ఆయనను కోరినట్లు తెలుస్తోంది. -
మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
-
మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
కాపు రిజర్వేషన్ల కోసం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి రోడ్డెక్కుతున్నారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, తుని ఘటన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు మంత్రుల బృందం వచ్చి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని ముద్రగడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాంతో.. కాపులకు చంద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అక్టోబర్ 14వ తేదీనే ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంత ఇంట్లో ఆయన ఈ విషయం తెలిపారు. ఆగస్టులోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే తాను పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర ప్రారంభించి, అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర చేస్తానన్నారు. ఇంతకుముందు ఆయన తుని సమీపంలో కాపు ఐక్య గర్జన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ప్రభుత్వం బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించింది. అణిచివేతకు సర్కారు రె'ఢీ' ముద్రగడ పాదయాత్రను అణిచివేసేందుకు రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ క్యానన్లు సిద్ధం చేశారు, ఇతర రాష్ట్రాల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రప్పించి మోహరించారు. అయితే ప్రభుత్వ చర్యలను అధిగమించి మరీ పాదయాత్రను విజయవంతం చేయాలని కాపు జేఏసీ భారీ ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగించి తీరుతామని జేఏసీ స్పష్టం చేసింది.