‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’ | congress mahila wing state president Sunkara Padmasri complaint against mla vamshi | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’

Published Mon, Jun 12 2017 7:50 PM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’ - Sakshi

‘ఎమ్మెల్యే వంశీ నుంచి నాకు ప్రాణహాని’

గన్నవరం : కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మ శ్రీ కోరారు. ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆమె లేఖ ద్వారా విన్నవించారు.

గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ అవినీతి, ఆక్రమాలు ప్రశ్నించినందుకు, తన గూండాలు, అనుచరులు ద్వారా బెదిరింపులు వస్తున్నాయని పద్మశ్రీ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తన పై పోటీ చేయాలని ఆమె సవాల్‌ విసిరారు. కాగా ఈ విషయంపై పద్మశ్రీ ఇప్పటికే విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement