
డిసెంబర్‌లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ గురువారం జీవో జారీ చేశారు.