శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టుకు నివేదిక
హైదరాబాద్ : తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక మృతి చెందినవారికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ...హైకోర్టు ఆదేశించింది.
ఎన్కౌంటర్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారని న్యాయస్థానం ఆరా తీసింది. పోలీసులే ఎన్కౌంటర్ చేసి...వాళ్లే దర్యాప్తు చేస్తే ఎలా అని ప్రశ్నించింది. అసహజ మరణం కింద కూలీలు మరణించారని కేసు ఎందుకు నమోదు చేయలేదని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఈ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.