ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మల్కన్‌గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన పోలీసు కాల్పులల్లో మొత్తం 31 మంది చనిపోయారని వీరిలో 22 మంది మావోయిస్టులు కాగా, మరో తొమ్మిది మంది సాధారణ పౌరులని మావోయిస్టు పార్టీ తెలిపింది. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట బుధవారం ఆడియో టేపులు విడుదలయ్యాయి. పోలీసులు ఏవోబీలో కూంబింగ్ చర్యలు ఆపని పక్షంలో మావోయిస్టు పార్టీ నుంచి ప్రతిఘటన తప్పదని జగబంధు హెచ్చరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘31 మంది కామ్రేడ్స్ హత్యపై పోలీసులు పూర్తి అవాస్తవాలు చెబుతున్నారు. పోలీసుల దిగ్బంధం వల్ల ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ఆలస్యం జరిగింది.