విజయనగరం : ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో పరిస్థితి అదుపులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. మంగళవారం విజయనగరం గ్రామీణ పోలీస్స్టేషన్తోపాటు పీటీసీలోని నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జె.వి.రాముడు మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులతోపాటు పోలీస్ సౌకర్యాలు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని చెప్పారు. పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డీఐజీ, జిల్లా ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.