అనంతపురం : ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్కెట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
అలాగే స్థానిక కొండ మీద కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను రాముడు ప్రారంభించారు. అనంతరం రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుతోపాటు... గ్రామంలోని శ్మశాన వాటిక ప్రహరిగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రూ. 1.60 కోట్లతో గ్రామంలో నిర్మించిన రోడ్డును రాముడు ప్రారంభించారు.