
సాక్షి, అమరావతి: ఏసీబీలో నమోదైన కేసులన్నీ పరిష్కరించగల్గితే ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏసీబీ అర్ధవార్షిక సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్పషల్ కోర్టు యాక్ట్ అందుబాటులోకి తెచ్చామనీ, 2016 అనంతరం నమోదైన కేసులు దీని పరిగణలోకి వస్తాయని వెల్లడించారు.
అవినీతిని నిర్మూలించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సిబ్బంది నియామకానికి కొత్తగా రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నామని అన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ నిందితులు తప్పించుకోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఏసీబీ కార్యాలయాలను చక్కటి వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment