ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం | Andhra Pradesh DGP orders case file against kancha Ilaiah | Sakshi
Sakshi News home page

ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం

Published Tue, Sep 19 2017 9:25 AM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం - Sakshi

ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం

సాక్షి, అమరావతి: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి...కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఐలయ్యకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తక్షణమే వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించిన, న్యాయపరంగా ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement