రైతు ఆత్మహత్యలకు కారకులు | Kancha ilaiah comments on Aryavaisyulu | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలకు కారకులు

Published Mon, Sep 18 2017 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతు ఆత్మహత్యలకు కారకులు - Sakshi

రైతు ఆత్మహత్యలకు కారకులు

ఆర్యవైశ్యులపై ఐలయ్య 
- కోమట్లు చేపలు తినరు, కల్లు తాగరు 
అందుకే నా పుస్తకాన్ని అర్థం చేసుకోలేదు 
 
హన్మకొండ అర్బన్‌: ‘‘ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలకు వ్యవసాయ మార్కెట్లలో కోమట్లు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. దాంతో రైతులు నష్టపోయి చివరకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులవుతున్నారు’’ అంటూ టీ–మాస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్కెట్లలో ఇకపై కోమట్ల ఆటలు సాగబోవు. టీ–మాస్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ కమిటీలు వేస్తాం. అవి నిర్ణయించిన ధరకే రైతుల నుంచి వారు పంటకొనాలి’’అని చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం టీ–మాస్‌ ఆవిర్భావ సభలో ఐలయ్య ప్రసంగించారు. ‘‘కోమట్లు చేపలు తినరు. కల్లు తాగరు.

అందుకే నేను రాసిన పుస్తకాన్ని సరిగా అర్థం చేసుకోలే కపోయారు.గ్రామాల్లో తూకంలో దండె కొట్టడం మొదలు, బడా కంపెనీలు స్థాపించడం దాకా వారు ప్రజల్ని దోపిడీ చేశారు. నేను బయటికొస్తే మెడలో చెప్పులు వేస్తామని, నాలుక కోస్తామని బెదిరించి రోడ్డెక్కుతున్నారు. వీటికి భయపడబోను. నన్నెవరు చంపినా అందుకు కోమట్లే బాధ్యులు. ఆ సంఘం అధ్యక్షుడు రామకృష్ణను వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు పెద్దగా ఇంగ్లిష్‌ రాదు. నేను యాదవ కులంలో పుట్టి దుడ్డు కర్ర వదిలి ఉన్నత విద్య చదివా. ఇంగ్లిష్‌ ధారాళంగా మాట్లాడగలను’’ అన్నారు.

వైశ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. ‘‘రిలయన్స్, అంబానీ, ఆదానీ, కిర్లోస్కర్‌ వంటి ఆర్యవైశ్యుల వ్యాపార లాభాల్లో ఏటా ఒక్క శాతం విరాళంగా ఇచ్చినా రూ.30 వేల కోట్లవుతాయి. నష్టపోయిన రైతు కుటుంబాలను ఆ డబ్బుతో ఆదుకోవచ్చు. ఆ కంపెనీల వారు బీజేపీకి ఇచ్చే విరాళాల్లో సగం మొత్తం చూసుకున్నా రూ.25 వేల కోట్లవుతాయి. దాంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవచ్చు. సైనిక, రైతు కుటుంబాలకు కోమటోళ్ల కంపెనీల్లో 5 శాతం ఉద్యోగాలివ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... రాష్ట్రంలో కు టుంబ పాలనను అంతం చేసి సామాజిక తెలంగాణ సాధించడమే టీ–మాస్‌ లక్ష్యమన్నారు. గద్దర్‌ పాల్గొ న్నారు. సభ ప్రారంభానికి ముందు ఆర్యవైశ్య సంఘా ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement