ఖమ్మంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ | conflict between the two groups in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Published Thu, Sep 21 2017 2:42 AM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

conflict between the two groups in Khammam

ఆర్యవైశ్యుల ర్యాలీ– బహుజన జేఏసీ ధర్నా
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య పుస్తకాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్యులు.. ఆయనకు భద్రత కల్పించాలని బహుజన జేఏసీ వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాలతో బుధవారం ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఐలయ్య రాసిన పుస్తకంలో ఆర్యవైశ్యులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నగరంలోని జెడ్పీ సెంటర్‌కు చేరగా.. అదే సమయంలో బహుజన జేఏసీ నాయకులు ఐలయ్యకు భద్రత కల్పిం చాలని ధర్నా చేపట్టారు.

దీంతో ఎదురుపడిన ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. ఆర్యవైశ్యుల ర్యాలీలో పాల్గొన్న కొందరు బహుజన జేఏసీ నాయకుల వైపు చెప్పులు చూపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జేఏసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆర్యవైశ్య సంఘానికి చెందిన కొందరు జెడ్పీ కార్యాలయంలోకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేసి.. టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement