జనగామలో ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ
Published Wed, Sep 13 2017 1:26 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం రైల్యే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్యవైశ్యులను కించపరిచే విందంగా కుల-మతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా వ్యవరిస్తున్న కంచె ఐలయ్య పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారపై రాస్తారోకో నిర్వహించి ఐలయ్య దిష్టి బొమ్మ దహనం చేశారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి
Advertisement
Advertisement