
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'కోమటోళ్లు-సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆర్య వైశ్యులు ఆదివారం ధర్నా నిర్వహించారు. కంచ ఐలయ్య కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.