ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద | swami paripoornananda fires on kancha ilaiah | Sakshi
Sakshi News home page

ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద

Published Wed, Sep 20 2017 1:00 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద - Sakshi

ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద

కాకినాడ: కంచె ఐలయ్యపై  శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. వైశ్యులు తమ వ్యాపారాలను ఖచ్చితంగా చేస్తారు.. తమకు వచ్చిన దాంట్లో పది శాతం సమాజం కోసం ధర్మకార్యాలు చేసే పుణ్య చరిత్ర వైశ్యులదన్నారు. అలాంటి వాళ్ళను ఐలయ్య స్మగ్లర్లు అని అంటాడా అని నిలదీశారు. మతం మారిన తరువాత ఆయనకు మతిపోయిందన్నారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, మల్టీ నేషనల్ కంపెనీలు చేసిన దోపిడీపై ఐలయ్య ఏనాడు నోరు విప్పడు అని విమర్శించారు.
 
దళితుడనే పేరు పెట్టుకుని దళితులనే మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. హిందుత్వ జోలికి వస్తే ఐలయ్య కధ కంచికి చేరుతుందని హెచ్చరించారు. దేశ భద్రతపై ఐలయ్య దెబ్బ కొడుతున్నాడంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచుకుని ఐలయ్య, ఆయన వెనక ఉన్నవారిపై దృష్టి పెట్టాలని కోరారు. జాకీర్ నాయక్ తరహాలో ఐలయ్యపై నిఘా పెట్టి విచారణ జరపాలని, లేదంటే తమ గళం, దళం, బలం ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement