Swami paripurnananda
-
కేసీఆర్.. నయా నిజాం
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలలో జరిగిన రోడ్‌షోలలో మాట్లాడారు. కొందరు శ్రీరాముడిని నోటికొచ్చినట్లు తూలనాడితే అది సరికాదన్న తనను కేసీఆర్ రాష్ట్రం నుంచి బహిష్కరించారని అన్నారు. తనను కాకినాడకు తరలించే క్రమంలో భద్రాచలం రాముడిని దర్శించుకుంటానని చెప్పినా అనుమతించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాచలం ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ జిల్లాలో గిరిజనులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని వారికి అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు పట్టాలిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమం రాజ్యమేలుతోందని ఆరోపించారు. రామాయణం సర్క్యూట్ కింద ఖర్చు చేయాల్సిన రూ.100 కోట్లను మంత్రి తుమ్మల ఇతర ప్రాంతాల్లో ఉపయోగించారని అన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం జిల్లా వరకు ఉన్న సుమారు 30 వేల మంది గిరిజన పూజారులకు బీజేపీ అధికారంలోకి వచ్చాక గౌరవవేతనం ఇస్తామని, భద్రాచలంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గిరిజనులకు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. -
సమయం వచ్చినప్పుడు నేనే మీడిఅయాకు వెల్లడిస్తా
-
ఐలయ్యకు మతిపోయింది: స్వామి పరిపూర్ణానంద
కాకినాడ: కంచె ఐలయ్యపై శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. వైశ్యులు తమ వ్యాపారాలను ఖచ్చితంగా చేస్తారు.. తమకు వచ్చిన దాంట్లో పది శాతం సమాజం కోసం ధర్మకార్యాలు చేసే పుణ్య చరిత్ర వైశ్యులదన్నారు. అలాంటి వాళ్ళను ఐలయ్య స్మగ్లర్లు అని అంటాడా అని నిలదీశారు. మతం మారిన తరువాత ఆయనకు మతిపోయిందన్నారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, మల్టీ నేషనల్ కంపెనీలు చేసిన దోపిడీపై ఐలయ్య ఏనాడు నోరు విప్పడు అని విమర్శించారు. దళితుడనే పేరు పెట్టుకుని దళితులనే మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. హిందుత్వ జోలికి వస్తే ఐలయ్య కధ కంచికి చేరుతుందని హెచ్చరించారు. దేశ భద్రతపై ఐలయ్య దెబ్బ కొడుతున్నాడంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచుకుని ఐలయ్య, ఆయన వెనక ఉన్నవారిపై దృష్టి పెట్టాలని కోరారు. జాకీర్ నాయక్ తరహాలో ఐలయ్యపై నిఘా పెట్టి విచారణ జరపాలని, లేదంటే తమ గళం, దళం, బలం ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు. -
గో సంరక్షణతో రైతు ఆత్మహత్యల నివారణ
దయచేసి గోవధ చేయవద్దు గో రక్షా దివస్‌లో పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్: గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రొత్సహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని, ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు గోవులను పంపిణీ చేసేలా గో క్రాంతి పథకాన్ని (గతంలో పశు క్రాంతి పథకం లాగా) ప్రవేశపెట్టాలని కోరారు. గో రక్షా దివస్‌ను పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్ గోశాలలో గురువారం గోపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ సరిపోవడం లేదన్నారు. గోవుల పెంపకం, పశు సంపద, పాడి తదితర అంశాలపై ప్రభుత్వాలు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గో రక్షణకు సంబంధించి డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. భారత భూమిలో దయచేసి గోవధ చేయొద్దని కోరారు. గో రక్షా దివస్‌గా ప్రకటించాలి ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తేదీన గో రక్షా దివస్‌గా ఏపీ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించాలని కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చింతల రామచంద్రా రెడ్ది మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పండితుల మహాసభలో 10వ తేదీన గోమాతకు పూజలు చేయాలని నిర్ణయించినట్లు, ఆ ప్రకారమే గో రక్షా పూజ నిర్వహించినట్లు తెలిపారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రకాశ్ రావు గోశాల ట్రస్టు చైర్మన్ కమల్ నారాయణ అగర్వాల్‌కు రూ. 25 వేలను విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మన సంస్కృతి మహోన్నతం
కామారెడ్డి : ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పదని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆ సంస్కృతి పరంపరను కొనసాగించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమాన్ని స్వామీజీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి పరిపూర్ణానంద స్వామి ప్రవచనామృతాన్ని అందించారు. భారతీయుల చింతన, భావన విలక్షణమైనవన్నారు. విలక్షణమైన భావన వెనుక ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక మహత్తరమైన సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. సంస్కారాన్ని, సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకోకపోతే వెర్రిలా కనబడుతుందన్నారు. అర్థం చేసుకోలేనివానికి ఏదైనా తప్పుగానే కనబడుతుందన్నారు. దీనిని అర్థం చేసుకోలేనివారే దేవునిపేరు మీద పెద్ద వ్యాపారం జరుగుతోందని విమర్శిస్తుంటారన్నారు. ఆచరించే ధర్మం వెనుకనున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాలు నిర్వహించే విషయంలో భుజానికెత్తుకునేవారికి అవగాహన ఉండాలని, లేకపోతే విమర్శలపాలవుతారని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారం, చరిత్రను చాటేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాస్తికులు సైతం అర్థం చేసుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు రాధాకృష్ణశర్మ, గంగవరం ఆంజనేయశర్మ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్, ప్రతినిధులు ఉదయ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్, రమేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పేకమేడలా రాజధాని నిర్మించవద్దు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సింగపూర్ నమూనాలా ఉండరాదని స్వామి పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిని సింగపూర్‌లా నిర్మిస్తానని అపార అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు పేర్కొనడం సరికాదన్నారు. సింగ్‌పూర్‌లా రాజధాని నిర్మిస్తే అది పేకమేడలా ఉంటుందని స్వామీజీ చెప్పారు. సింగపూర్‌ను కాపీకొట్టవద్దన్నారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో తులతూగుతుందని స్వామీజీ చెప్పారు.