'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం' | andhra pradesh dgp assure to seemandhra people security | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం'

Published Wed, Jun 4 2014 6:15 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం'

'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు వచ్చే అవకాశముందని తెలిపారు.

హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలని అప్పుడే ఇరు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయని అంతకుముందు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement