సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల శాంతిభద్రతల విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) ఉన్న ఎం.మునిరామయ్యపై వేటు పడింది. ఆయన్న బదిలీ చేస్తూ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముని రామయ్య హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో (సీసీఎస్) నమోదైన చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారంలో ముని రామయ్య పాత్రపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సవాంగ్ ఆయనపై బదిలీ వేటు వేశారు. మరోపక్క సీసీఎస్ పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపారి చుండూరు సునీల్‌కుమార్‌ను డబ్బు కాజేయడానికి రంగంలోకి దింపిన నకిలీ డీఎస్పీ కేపీ రాజు కోసం గాలింపు ముమ్మరం చేశారు .
చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. ఆరా తీయగా అసలు విషయం తెలిసి...
Comments
Please login to add a commentAdd a comment