Suspension orders
-
తిరుమల ఏఎస్పీ ముని రామయ్యపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల శాంతిభద్రతల విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) ఉన్న ఎం.మునిరామయ్యపై వేటు పడింది. ఆయన్న బదిలీ చేస్తూ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముని రామయ్య హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారంలో ముని రామయ్య పాత్రపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సవాంగ్ ఆయనపై బదిలీ వేటు వేశారు. మరోపక్క సీసీఎస్ పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపారి చుండూరు సునీల్‌కుమార్‌ను డబ్బు కాజేయడానికి రంగంలోకి దింపిన నకిలీ డీఎస్పీ కేపీ రాజు కోసం గాలింపు ముమ్మరం చేశారు . చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... -
సాక్షి ఎఫెక్ట్: బాసరలో అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు
నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర దేవస్థానంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది. ఆలయంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై 2017లో ‘సాక్షి’‘సరస్వతి సాక్షిగా దోపిడీ పర్వం’శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ సుదీర్ఘంగా విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. దేవస్థానంలో రూ.లక్షల్లో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై వేటు వేసింది. గతంలో ఆలయ ఏఈఓగా చేసిన గంగా శ్రీనివాస్ (ప్రస్తుతం కొమురవెల్లిలో పోస్టింగ్), సీనియర్ అసిస్టెంట్ శైలేష్‌లను సస్పెండ్ చేయగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నూకం రజిని, ఎలక్ట్రీషియన్ టి.కాంతారావులను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో కీలకంగా ఉన్న అప్పటి ఆలయ ఈఓ ఎ.సుధాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ మమ్మాయి సాయిలు రిటైర్ అయ్యారు. వీరిపై ప్రభుత్వం శాఖా పరమైన చర్యలకు ఆదేశించింది. దొంగ బిల్లులు పెట్టి బినామీల సాయంతో వీరంతా లక్షల్లో డబ్బు కాజేశారు. ఇదిలా ఉంటే దోపిడీ పర్వంలో కీలక సూత్రధారులను సస్పెండ్ మాత్రమే చేయడంతో స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆలయ ఈఓ వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసులో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలతో నిద్రపోయిన అధికారి
కోల్‌కతా: ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం 31 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగా బెంగాల్ ఎన్నికల కమిషన్.. నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసింది. పోలింగ్‌కు ముందు రోజు సదరు అధికారి తనకు బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో పాటు ఉన్నందుకు గాను బెంగాల్ ఈసీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. అయితే అధికారి వద్ద ఉన్న ఈవీఎం, వీవీపాట్ సామాగ్రిని ఎన్నికల్లో వినియోగించలేదని ఈసీ తెలిపింది. ఈ ఘటన ఉలుబేరియా ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తులసిబీరియా గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తపన్ సర్కార్ అనే డిప్యూటి అధికారి 17 సెక్టర్ ఉలుబేరియా ఉత్తర్ పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి నిర్దేశించిన 4 ఈవీఎంలు, వీవీపాట్లను తీసుకుని తనకు బంధువు, స్థానిక టీఎంసీ నాయకుడు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో వివాదం రాజుకుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగాల్ ఎన్నికల కమిషన్ తపన్ సర్కార్‌ని సస్పెండ్ చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సెక్టార్ అధికారి చర్యలు భారతదేశ ఎన్నికల కమిషన్ నియమావళికి తీవ్ర భంగం కలిగించాయి. ఇందుకు గాను అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక అధికారి వద్ద ఉన్న ఈవీఎంలు, వీవీపాట్లను పోలింగ్‌లో వినియోగించలేదు. ఎక్స్ట్రాగా ఉన్న ఈవీఎంలను అధికారి తనతో పాటు ఉంచుకున్నాడు. ఏది ఏమైనా అతడి చర్యలు ఆమోదించదగినవి కావు. అధికారితో పాటు ఆ ప్రాంత పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటాం’’ అని ఈసీ తెలిపింది. ఈ ఘటన అనంతరం జనరల్ అబ్జర్వర్ నీరజ్ పవన్ అన్ని ఈవీఎం సీళ్లను పరిశీలించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండి పడ్డారు. పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణం. ఈ క్రమంలో సదరు అధికారి ఇంట్లో ఉన్న అన్ని ఈవీఎంలను, వీవీపాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నారు. కొద్ది రోజుల క్రితం అస్సాంలో బీజేపీ నాయకుడి వ్యక్తిగత వాహనంలో ఈవీఎం తరలించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం -
'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు'
సాక్షి, గుంటూరు: ఆకాశ రామన్న ఉత్తరంతో తీగ లాగితే డొంక కదిలింది. టీడీపీ హయాంలో అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. జరిగిందిలా... మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన చిమటా కోటేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ మహిళతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కలసి సహ జీవనం కొనసాగించారు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలించుకోవాలని కోటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. మహిళను హత మార్చేందుకు ముందుగా మంగళగిరి మండలం టీడీపీ అధ్యక్షుడు అభయం తీసుకున్నాడు. దీంతో టీడీపీ మండల అధ్యక్షుడు ఈ విషయంపై డీఎస్పీతో ముందుగా ఒప్పందం కుదిర్చాడు. మహిళను హత్య చేసినా కేసు కాకుండా ఉండేందుకు రూ.10 లక్షలు కోటేశ్వరరావు ఇచ్చేలా మాట్లాడాడు. దీంతో 2017లో కోటేశ్వరరావు సదరు మహిళను రేపల్లె సమీపంలోని నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్ళి హత మార్చి శవం కనపడకుండా చేశాడు. మహిళ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 336/2017 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. హత్య అనంతరం టీడీపీ మండల అద్యక్షుడు సహకారంతో డీఎస్పీ రామాంజనేయులుకు కోటేశ్వరరావు రూ.10 లక్షలు ఇచ్చాడు. వెలుగు చూసిందిలా... గతేడాది నవంబరులో కోటేశ్వరరావు మహిళను హత మార్చాడనే వివరాలతో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ఆకాశరామన్న పేరుతో ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గతేడాది నవంబరు 21వ తేదీన “మంగళగిరిలో మహిళ హత్య?’ పేరుతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ రామాంజనేయులును అదే రోజున డీజీపీ కార్యాలయానికి పిలిపించి ప్రాథమికంగా విచారించారు. అయితే తనకేమీ సంబంధ లేదని చెప్పడంతో శాఖాపరమైన విచారణకు డీజీపీ ఆదేశించారు. విచారణలో నిందితుడి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకొని హత్యను మిస్సింగ్ కేసుగానే వదిలేసినట్లు తేలింది. సీరియస్‌గా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ తన కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేశారు. అక్రమ ఆస్తులను వెలికితీయాలి కృష్ణా జిల్లాకు చెందిన డీఎస్పీ రామాంజనేయులు సామాన్య కుటుంబంలో పుట్టారు. ప్రస్తుతం ఆయన కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన ఆయన గుంటూరు అర్బన్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వరకు పని చేశారు. ఈ క్రమంలో అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో చిన్నబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో రెండు సార్లు ఆయన్ను నార్త్ జోన్ డీఎస్పీ నుంచి తొలగించినా మళ్లీ రాత్రికి రాత్రే జీవోలను తెచ్చి అక్కడే పోస్టింగ్ పొందాడు. అతని కుటుంబ సభ్యులతోపాటు బినామీల పేర్లతో కోట్ల రూపాయల విలువచేసే అక్రమ ఆస్తులు కూడగట్టాడని సమాచారం. హత్య కేసును కూడా మాఫీ చేసేందుకు యతి్నంచిన డీఎస్పీ పని తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. -
గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు ప్రజాపంపిణీ సరుకులు పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడువు పొడిగిస్తున్నా రేషన్ డీలర్లు డీడీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలలో ఇబ్బందులు తప్పేలా లేవు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించి డీడీలు కట్టాలని పలు పర్యాయాలు కోరినా, గడువు పొడిగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లే దిక్కుగా మారాయి. పేదలకు అసౌకర్యం కలుగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృమవుతాయోననే ఆందోళన అధికారులను వెంటాడుతోంది. నేటి నుంచి సమ్మె ప్రజాపంపిణీలో భాగమైన రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జూలై 1 నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ గడువులు ఇస్తున్నా రేషన్ డీలర్లు మెట్టు దిగకపోవడం, ప్రజాపంపిణీ సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో ఐకేపీ సంఘాలను అప్రమత్తం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రజాపంపిణీపై శిక్షణ ఇవ్వడం, పంపిణీకి గ్రామాల్లో ప్రదేశాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఐకేపీ సంఘాలకు ఆర్వోలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుండి ఈ నెల 5వ తేదీ వరకు గ్రామాలకు సరుకులు చేరవేస్తామని తెలిపారు. అయితే ప్రజాపంపిణీ సరుకులను ఈ నెల ఈ–పాస్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా డీలర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు డీడీలు చెల్లించేందుకు గడువు ఇస్తూ మీ–సేవా కేంద్రాల ద్వారా డీడీలు చెల్లించి ఆర్వోలు పొందేలా డీలర్లకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా 804 రేషన్ షాపులకు గాను శనివారం సాయంత్రం వరకు 27 మంది డీలర్లు డీడీలు చెల్లించారు. కాగా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయొద్దని జేసీ తహసీల్దార్లకు సూచించారు. మట్టి తిని బతకాలా? జడ్చర్ల: ‘ప్రజలు భోజనం చేసేలా బియ్యం అందజేసే చేతులకే అన్నం కరువైతే ఎలా.. తాము మట్టి తిని బతకాలా.. ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ రేషన్ డీలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇవ్వగా.. పరిష్కరించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ శనివారం జడ్చర్ల రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని భోజనం చేస్తున్న మాదిరిగా కూర్చున్నారు. న్యాయమైన సమస్యలు పరిశ్కరించాలని కోరితే సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.250 పైగా ఇస్తున్నారని.. అంతకంటే అధ్వానంగా తమ పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు వాపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సమస్యల సాధన సమితి అధ్యక్షులు పాలాది రమేశ్, బాధ్యులు కొంగలి నాగరాజు, శ్రీనువాసులు, కృష్ణయ్య, నగేశ్, చెన్నయ్య ,తుంగ రఘు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇక డీలర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిక్ షాకీర్, పరమటయ్య, ఎంపీటీసీ సభ్యులు బాలవర్దన్‌గౌడ్ తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
తెయూ సీఓఈ సస్పెన్షన్
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) డాక్టర్ మామిడాల ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చే సిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వర్సీటీవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2014 జనవరి నాలుగున కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వర్సి టీలో పలువురు శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరారు. వారితోపాటు ఎంపికైన ప్రవీణ్ పది రోజుల తర్వాత తెయూ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తూ జూలై ఎనిమిదిన అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధర్మరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెయూలో చేరక ముందు డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇక్కడ చేరిన తర్వాత ఓయూలో వెంటనే రాజీ నామా చేయలేదని సమాచారం. ఇక్కడా, అక్కడా వేతనం పొందినట్లు తెలిసింది. ఒకే సమయంలో రెండు యూనివర్సిటీల్లో వేతనాలు పొందినట్లు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 16న ప్రవీణ్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి శనివారం వెలుగు చూశాయి. అప్పటి నుంచి సెలవులో వెళ్లిన ప్రవీణ్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరింపజేసుకునేందుకు ఉన్నత విద్యామండలితోపాటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రొబేషనరీ సమయంలో ఉన్న ప్రవీణ్ ఉద్దేశ పూర్వకంగా రెండు చోట్ల వేతనాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. పీహెచ్డీ తెలుగు అడ్మిషన్లు రద్దు తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ తెలుగు విభాగం అడ్మిషన్లను రద్దు చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యార్ డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా ఆల స్యంగా వెలుగు చూసింది. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు అప్పుడు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏక సభ్య కమిటీగా నియమించారు. ఆయన విచారణ జరిపి నివేదికను ఇన్చార్జి వీసీకి అందజేశారు. అనంతరం అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన వీసీ, ఆర్ట్స్ డీన్ ధర్మరాజు, తెలుగు హెచ్ఓడీ కనకయ్యలకు చార్జ్ మెమో లు జారీ చే శారు. అడ్మిషన్లను రద్దు చేశారు. ఈ విషయమై వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ లింబాద్రిని సంప్రదించగా ఉత్తర్వులు అందిన మాట వాస్తమేనని తెలిపారు.