సాక్షి, హైదరాబాద్: చెప్పేవి నీతులు.. చేసేవి తప్పుడు పనులు.. నిత్యం టీవీ5 వేదికగా రాజకీయ ప్రవచనాలు వల్లించే సాంబశివరావుపై గచ్చిబౌలి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. తమ కంపెనీనిలో సాంబశివరావు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పని చేస్తూ మోసం చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేశారు.
కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కారు కొనుగోలు చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సంధ్యా హోటల్స్ అకౌంటెంట్ ఫిర్యాదుతో సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌కు మధ్య జరిగిన పెట్రోల్ బంక్ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్‌స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సరనాల శ్రీధర్‌రావు ఇటీవల ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్ బంక్ డీలర్‌షిప్ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు.
ఇదీ చదవండి: టీవీ 5 సాంబశివరావు చెప్పేవన్నీ అబద్ధాలే!
Comments
Please login to add a commentAdd a comment