గవర్నర్తో ఏపీ సీఎస్, డీజీపీ భేటీ | andhra pradesh chief secretary, DGP meet Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో ఏపీ సీఎస్, డీజీపీ భేటీ

Published Tue, Jun 16 2015 4:59 PM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

గవర్నర్తో ఏపీ సీఎస్, డీజీపీ భేటీ - Sakshi

గవర్నర్తో ఏపీ సీఎస్, డీజీపీ భేటీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమ భద్రతను తామే ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకుముందు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయం గురించి వీరు నరసింహన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీ సీఎస్, డీజీపీ కూడా ఇదే విషయం చర్చించినట్టు సమాచారం. దీనికి తోడు ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ గవర్నర్ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement