Andhra Pradesh chief secretary
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీఎస్ జవహర్‌రెడ్డి
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సీఎం జగన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి.. సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. చదవండి: (నాడు మోసగించి, నేడు లెక్చర్లా?) -
AP: సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇవాళే బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారాయన. సీఎం ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి దాకా అందేందుకు కృషి చేస్తానని, పల్లెల్లోని పేదలకు ఫలాలు అందేలా యంత్రంగాన్ని నడిపిస్తాని కేఎస్ జవహర్‌రెడ్డి ప్రకటించారు. -
ఏపీ కొత్త సీఎస్ గా కెఎస్ జవహర్ రెడ్డి
-
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ
-
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇవీ చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీల భర్తీకి సంబంధించి సీఎస్ ఇటీవల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను, అవసరమైన పోస్టుల భర్తీ వివరాలను డైరెక్టరీ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ విభాగంలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని స్పష్టం చేశారు. ఆ లెక్కలు ఆధారంగా అవసరమైన పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా క్యాలెండర్ రూపొందించి మే 31న విడుదల చేస్తారని చెప్పారు. ఇందుకోసం గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను లెక్క తేల్చాలని సూచించారు. అనంతరం సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఎస్ ఇంకా ఏం చెప్పారంటే.. లోతుగా పరిశీలించి వివరాలు ఇవ్వాలి గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు, అధికారాలను వాటికి బదిలీ చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలించాలి. రాష్ట్ర విభజన అనంతరం కొన్ని శాఖలు, విభాగాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పని తక్కువైన నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఖాళీల వివరాలను హెచ్ఆర్ఎంఎస్లో పొందు పరచాలి. బ్యాక్లాగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలను కూడా పొందుపరచాలి. ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సూచించాలి. అన్ని శాఖలకు చెందిన పోస్టులు, ఖాళీలు, భర్తీ వివరాలన్నీ కూడా ఒకే చోట తెలిసేలా డైరెక్టర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ డాస్‌బోర్డ్‌లో లభ్యమవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల రూపంలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఆన్లైన్లో నేరుగా చూసే అవకాశం ఉంటుంది. -
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని
-
పీఎం వీడియో కాన్ఫరెన్స్ ఇంచార్జి సీఎస్
సాక్షి, అమరావతి: అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంచార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇంచార్జ్ సీఎస్ తోపాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజాగా బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. -
మార్కెట్ ధరకే ఏపీఐఐసీకి భూమి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలకు భూములను అమ్ముకునే ఏపీఐఐసీకి ప్రభుత్వం భూములను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సోమవారం సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ శాఖకు చెందిన భూమిని ఉచితంగా ఏపీఐఐసీకి ఎందుకు కేటాయించాలి? ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది? అని దినేష్‌కుమార్ వాకబు చేశారు. గతంలో మార్కెట్ ధరకు కేటాయించే విధానం ఉండేదని, ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కేటాయించే పద్ధతి తర్వాత వచ్చిందని అధికారులు వివరించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కాకుండా ఉచితంగానే కేటాయించాలని ఏపీఐఐసీ కోరింది. దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని’ రెవెన్యూ అధికారులు వివరించారు. నివేదిక సిద్ధం చేయండి ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు గతంలో ఉన్న జీవోలు, తర్వాత వచ్చిన జీవోలు, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఏవిధానం మంచిది? ఇందుకు ప్రామాణికాలేమిటి? అనే వివరాలతో పాటు జీవో కాపీలను కూడా జత చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దీనిపై సమీక్షించి ఏపీఐఐసీకి మార్కెట్ ధరకే భూములు కేటాయించడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అయితే ఆయన తీసుకునే నిర్ణయం అంతిమం కాదు. సీఎస్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేబినెట్‌దే అవుతుందని ఒక అధికారి తెలిపారు. -
బెజవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరం..
సాక్షి, అమరావతి : జ్యోతిరావు పూలే విగ్రహ నివాళి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు శనివారం లేఖ రాశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు. కాగా పూలే విగ్రహానికి నివాళి వివాదంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కేవీపీ సీఎస్‌కు లేఖ రాశారు. పోలీసులు మా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. -
సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ మార్చి 5న సమావేశం కానుంది. విభజన చట్టం అమలు తీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్లోని అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్ హాజరు కానున్నారు. కాగా ఫిబ్రవరి 23న సమావేశం జరగాల్సి ఉండగా, ఆ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఆదేశాలను అపహాస్యం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తాము ఇచ్చిన ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తమ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఆదేశించినా పందేలు యథాతథంగా జరిగాయని, స్వయంగా ప్రజా ప్రతినిధులే పందేలకు హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. జరిగిన కోడి పందేలను ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. అరుదుగా టీవీలు చూసే తమకే, టీవీల్లో కోడి పందేల దృశ్యాలు పదే పదే కనిపించాయని తెలిపింది. ‘కోడి పందేల విషయంలో ఏమీ చేయలేమంటూ మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని మాకే చెప్పాలి.. అప్పుడు మిగిలిన సంగతులను మేం చూసుకుంటాం’ అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఏపీ డీజీపీలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మా ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. నివేదికలు ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. తమ ఆదేశాల ప్రకారం నివేదికలు సమర్పించనందుకు అటు సీఎస్ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కోడి పందాలపై హైకోర్టు ఆగ్రహం
-
ఫ్లెక్సీల్లో నరేంద్ర మోదీ ఫోటో పెట్టండి..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులతో రాష్ట్రం చేపట్టే పథకాలలోని ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని ఆయన తన లేఖలో కోరారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛతే సేవ’ డిజైన్లలో నరేంద్ర మోదీ బొమ్మ లేకపోవడం శోచనీయమని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. గతంలో కేంద్ర పథకాల్లో కూడా ప్రధాని ఫోటో లేకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు. కాగా స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకూ దేశవ్యాప్తంగా 'స్వచ్ఛతే సేవ' పేరిట చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఆస్తులపై ఆదేశాలను ఉపసంహరించుకోండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఘాటైన లేఖ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునిర్వభజన చట్టం షెడ్యూల్ పదిలోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీపై ఇటీవల కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు వీలుగా ఆదేశాల జారీ చేయాలని కేంద్ర హోంశాఖను డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షికి ఘాటైన లేఖ రాశారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్లకు అనుగుణంగా ఉందని, చట్టంలోనే ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో పంపిణీ చేసుకోవాలని ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అయితే సుప్రీం తీర్పును అమలు చేయకుండా కేంద్ర హోంశాఖ ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ ఆదేశాలు ఇవ్వడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవడంతో పాటు సుప్రీం తీర్పునకు అనుగుణంగా పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 48తో పాటు 47 కూడా చూడాలని, ఇందుకు అనుగుణంగానే స్థిర, చరాస్తులతో పాటు భూమి, స్టోర్స్, ఆర్టికల్స్ ఇతర వస్తువులను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున అన్ని ఆస్తులు తెలంగాణలోనే ఉంటాయని, రాష్ట్రం విడిపోయినందున ఏపీకి ఏమీ రావని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తీర్పులో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 48, 47 సెక్షన్ల మేరకు ఆస్తులతో పాటు అప్పులు, ఆర్థికపరమైన సర్దుబాటు ఉన్నట్లు పేర్కొన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. -
లోకేష్ ఇష్టారాజ్యం !
-
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అనుమతించాల్సిందిగా గతంలో కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది. ఆ అనుమతి ఈ నెలాఖరుతో(నవంబర్ 30) ముగిసింది. అయితే టక్కర్‌ను మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం అమోదం తెలిపింది. -
సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. వాస్తవంగా టక్కర్ ఆగస్టు నెలాఖరునే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది. ఆ అనుమతి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టక్కర్‌కు మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం అమోదం తెలిపింది. -
4 వారాల్లో ఖాళీ చేస్తా : సీఎస్
హైకోర్టుకు పి.వి.రమేశ్ హామీ సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌కు చెందిన క్వార్టర్‌ను 4 వారాల్లో ఖాళీ చేస్తానని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని నమోదు చేసుకున్న హైకోర్టు ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
-
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
ఏపీ సీఎస్, సీఈసీకి కేంద్ర హోంశాఖ లేఖ నరసరావుపేట: ఓ టీవీ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల సందర్భంగా తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని, దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ న్యాయవాది, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జి.అలెగ్జాండర్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వ కార్యదర్శి ఎ.కె.ధావన్ నుంచి విడుదలైన లేఖ మంగళవారం తనకు అందిందన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తి రూ.28 లక్షలు మించి ఖర్చు చేయరాదని భారత ఎన్నికల కమిషన్ పరిమితి విధించిందని, దీనికి విరుద్ధంగా తనంతట తానే స్వయంగా ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల చెప్పిన అంశాన్ని తాను రాష్ట్రపతి, భారత ఎన్నికల కమిషన్ల దృష్టికి జూన్ 21న తీసుకెళ్లానని తెలిపారు. (చదవండీ: ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు) -
సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. కాగా టక్కర్ ను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక విడతలో మూడు నెలలు మాత్రమే కొనసాగించేందుకు అవకాశముంది. ఈ ఏడాది నవంబరు 30 వరకూ టక్కర్ సీఎ్‌స్ గా కొనసాగుతారు. కాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీ కాలం కూడా మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. -
ఏపీ సిఎస్‌ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
వెలగపూడి వెళ్లాల్సిందే...
27న పయనమవ్వాలని కార్యదర్శులకు ఏపీ సీఎస్ టక్కర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి అయినా, కాకపోయినా ముఖ్యమంత్రి పేర్కొన్న మేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ నెల 27న వెలగపూడి వెళ్లాలని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ స్పష్టం చేశారు. అదే తేదీన సీఎస్ కార్యాలయాన్ని సిబ్బంది సహా వెలగపూడికి తరలించాలని సూచించారు. ఆర్థిక శాఖతో పాటు ఆ శాఖకు చెందిన వివిధ విభాగాధిపతుల కార్యాలయాలను నూతన రాజధానికి తరలించే ప్రణాళిక అమలు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. తరలింపు కమిటీకి చైర్మన్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను నియమించారు. రవిచంద్ర మరిన్ని ఉప కమిటీలను ఏర్పాటు చేసి శనివారం సమావేశం నిర్వహించారు. ఐటీ మౌలిక వసతులు, ఫైళ్లు, రికార్డులు, ఫర్నిచర్ తదితర ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల ఫైళ్ల స్కానింగ్‌కు ఏర్పాట్లు: రాష్ట్రం విడిపోవడానికి ముందుగానే ఫైళ్లను స్కానింగ్ చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లను విభజించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్తున్న సమయంలో కూడా ముఖ్యమైన ఫైళ్లను స్కానింగ్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్రం విడిపోయిన సమయంలో లక్షల సంఖ్యలో ఉన్న ఫైళ్లకు చెందిన కోట్లాది పేజీలను స్కానింగ్ చేశారు. ఇప్పుడు రెండేళ్లకు చెందిన ఫైళ్లను మాత్రమే స్కానింగ్ చేయనున్నారు. -
అన్ని కోట్లు ఖర్చు... ఏం ఉపయోగం?
► గోదావరి పుష్కరాల్లో రూ.2వేల కోట్లు వ్యయం చేస్తే ఏమీ కన్పించలేదు ► కృష్ణా పుష్కరాలకు ఇష్టానుసారం ప్రతిపాదించొద్దు: సీఎస్ టక్కర్ హైదరాబాద్: ‘గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా ఏకంగా రూ.2వేల కోట్లు వ్యయం చేశారు. తీరా అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల పేరుతో ఇష్టానుసారం పనులను ప్రతిపాదించవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ టక్కర్ అధికారులను హెచ్చరించారు. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధి కారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది గోదావరి పుష్కరాల మాదిరి ఈసారి జరగకూడదని చెప్పారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1000 కోట్లకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసిందన్నారు. అన్ని పనులకు అనుమతులు ఇవ్వరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు వందల సంఖ్యలో సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయని, జీరో అవర్‌లో లేవనెత్తిన అంశాలకు జవాబులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. అన్ని శాఖలూ వెంటనే సమాధానాలను పంపించాలన్నారు. -
శ్రీవారి సేవలో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
తిరుమల : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సర కేలండర్, డైరీ లను అందజేశారు. ఆయన వెంట నిత్యాన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో సాగి వేణుగోపాల్ ఉన్నారు. -
సీఎస్ దత్తత గ్రామానికి ఎంపీ వైవీ నిధులు
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకాశం జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తన ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేశారు. తన స్వగ్రామమైన పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామాన్ని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో సామాజిక భవన నిర్మాణానికి ఎంపీ నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఇటీవల ఎంపీని కోరారు. సామాజిక భవన నిర్మాణానికి రూ.4.5 లక్షలను విడుదల చేస్తూ అంగీకార పత్రాన్ని మంగళవారం ప్రకాశం భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. కలెక్టర్‌కు అందజేశారు. -
చెన్నకేశవస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్
బత్తలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు శనివారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆయన జిల్లాలోని బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ డిజీపీ రాయుడు స్వగ్రామమైన నార్సింపల్లికి వెళుతూ మార్గమధ్యంలోని డి.చెర్లోపల్లిలో స్వామిని దర్శించుకున్నారు. అక్కడ చెన్నకేశవస్వామిని దర్శించుకున్న అనంతరం నీరూ- చెట్టూ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సీఎస్‌కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నాగభూషణం, ధర్మవరం ఆర్డీవో మల్లికార్జున, కల్యాణదుర్గం ఆర్డీవో రామారావు, స్వచ్ఛభారత్ అంబాసిడర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీ సీఎస్ కు నోటీసులిస్తాం'
హైదరాబాద్: గత కొన్ని నెలలుగా టీడీపీ సర్కార్ ఎంపీలను విధులను కాలరాసే విధంగా యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమ ఎంపీల విధులను పచ్చచొక్కా నేతలకే కట్టబట్టే యత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరోగ్య మిషన్ మానిటరింగ్ చైర్మన్ లుగా వైఎస్సార్ సీపీ ఎంపీలను కేంద్రం నియమిస్తే.. ఆ నియమాకాలను ఏపీ సర్కారు తొలగించిందన్నారు. కేంద్రం ఆదేశాలను పక్కకు పెట్టి ఏపీ సర్కారు తమ స్థానంలో టీడీపీ ఎంపీలను నియమిస్తూ జీవోలు ఇచ్చిందని.. రాష్ట్ర సర్కారు వైఖరి తప్పుబడుతూ కేంద్రం నుంచి తనకు లేఖ అందిందన్నారు. ఆ జీవో ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సర్కార్ కు కేంద్రం సూచించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు నోటీసులిస్తామన్నారు. న్యాయపరమైన చర్యలకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడేది లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయింపుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెల 29వ తేదీన ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఏపీ బంద్ ను విజయవంతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగులను సంప్రదించాకే తరలింపు
హైదరాబాద్: రాజధానికి ఉద్యోగులు, అధికారుల తరలింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఉద్యోగులను ఒకే సారి తరలించాలా లేదా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఉద్యోగులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతానికి ఒకే సారి ఉద్యోగులను అధికారులను తరలించాలని ఏపీ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలు సీఎస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. తమను తరలించే విషయంలో వారు ఇప్పటికే పలు భిన్నాభిప్రాయాలు తెలిపినందున పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపనున్నట్లు సీఎస్ పరోక్షంగా తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులను చేర్చుకోండని టి.సర్కారును ఆదేశించండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌కు ఏపీ సీఎస్ ఐవైఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా స్థానికత పేరుతో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కోరారు. శనివారం గోయల్‌కు కృష్ణారావు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం ఏడాదిలోగా ప్రభుత్వ రంగ సంస్థలే ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసుకోవాలని, సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే నిబంధన ఉందనే విషయాన్ని లేఖలో సీఎస్ గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విద్యుత్ సంస్థల నుంచి స్థానికత ఆధారంగా ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేసిందని వివరించారు. దీన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ న్యాయస్థానం సూచనలను కూడా పాటించడం లేదని సీఎస్ పేర్కొన్నారు. 40, 50 ఏళ్లుగా తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిని స్థానికేతరులుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం సమజసం కాదన్నారు. ఆంధ్రా ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో తెలంగాణ వారికి పదోన్నతులు కల్పించడం, కొత్త వారిని నియమించుకోవడానికే తెలంగాణ సర్కారు స్థానికత తెరపైకి తెచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఇదే అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు నష్టపోతారని, ఇందులో సమన్యాయం లేదని సీఎస్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం తొలగించిన ఆంధ్రా ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలాగ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికనే ఉద్యోగుల పంపిణీ జరగాలని, కానీ తెలంగాణ ప్రభుత్వం స్థానికత అంటూ కొత్తగా తెరపైకి తేవడం అన్యాయమన్నారు. -
ఏపీ సచివాలయంలో సీఎం ఆదేశాలు బేఖాతరు
హైదరాబాద్: గంట అదనంగా పని చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశాలు సచివాలయంలోనే అమలు కాలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం నాడు గంట అదనంగా పని చేయాలని ఆదేశించింది. అయితే తమకు సమాచారం అందలేదంటూ ఉద్యోగులు గంట ముందుగానే వెళ్లిపోయారు. దిగువ స్థాయి సిబ్బందికి సర్క్యులర్ చేరలేదని ఉద్యోగులు అన్నారు. అందుకే ముందుగానే వెళ్లినట్టు వారు వివరించారు. -
'గంటన్నర పాటూ చర్చించాం'
ఢిల్లీ: కేంద్ర హోం కార్యదర్శి ఎల్.సీ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గంటన్నర పాటు భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో కృష్ణారావు మాట్లాడుతూ..గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 పై చర్చించామని తెలిపారు. విభజనలోని షెడ్యూల్ 9,10 పై చర్చించామని చెప్పారు. -
గవర్నర్‌తో ఏపీ సీఎస్, డీజీపీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ భద్రతను తామే ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయం గురించి వీరు నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీ సీఎస్, డీజీపీ కూడా ఇదే విషయం చర్చించినట్టు సమాచారం. దీనికి తోడు ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ గవర్నర్‌ను కలిశారు. -
వీడియో కాన్ఫరెన్స్‌లపై సర్కార్ ఆంక్షలు
సర్క్యులర్ జారీ చేసిన సీఎస్ ఐ.వై.ఆర్. హైదరాబాద్: ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల జిల్లా, క్షేత్రస్థాయిలో అధికారుల సమయమంతా వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేందుకే సరిపోతోందని, క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. ప్రతీ శాఖకు చెందిన కార్యదర్శులు లేదా శాఖాధిపతులు జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల జిల్లాల్లో, క్షేత్రస్థాయి పనిచేయాల్సిన అధికారులకు సమయం దొరకడం లేదని ఇటీవల నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్‌లో ఏముందంటే.. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు ఇబ్బంది కలగకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు ఉండాలి. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలి. శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు తప్పనిసరిగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాల్సి ఉంటే ప్రతీ నెల మొదటి శనివారం మూడో శనివారం మాత్రమే నిర్వహించాలి. ప్రతీ శాఖ వీడియో కాన్ఫరెన్స్ రెండు గంటలకు మించి నిర్వహించరాదు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించిన మినిట్స్‌ను ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీఎం కార్యాలయంలో సంబంధిత అధికారికి పంపించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కార్యదర్శి గానీ శాఖాధిపతి గానీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంటే ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలి. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
-
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ పదో షెడ్యూల్లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని విజ్ఞప్తి అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది. సీఎస్ల మధ్య వాగ్యుద్ధం విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్‌లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే.. ఏపీ సీఎస్ కృష్ణారావు 1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్‌కే అప్పగించాలి. 2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది. 3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. 4. పదో షెడ్యూల్లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ 1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం. 2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం. 3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. 4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. -
పీఆర్సీ అమలుపై ఏపీ సీఎస్ ప్రాథమిక సమీక్ష
త్వరలో మంత్రుల కమిటీ ఏర్పాటు ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు అదనపు భారం నెలకు రూ. 8.96 కోట్లు సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమలు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమికంగా సమీక్షించారు. ఒక శాతం ఫిట్‌మెంట్‌కు నెలకు 8.96 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్నారని, 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫార్సు చేసిందని తెలిపారు. వాస్తవానికి 2013 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నా.. ప్రభుత్వానికి నివేదిక అందడంలో జాప్యం జరిగిందని, రాష్ట్ర విభజన, పాలనాపరమైన కారణాల వల్ల అమల్లో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చారని, కనీసం 35 శాతం ఫిట్మెంట్ ఇచ్చే యోచనలో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని, హెల్త్‌కార్డుల వ్యయంలో 40 శాతం భరించాల్సి ఉంటుందని, నిత్యావసర వస్తువుల ధరలూ మండిపోతున్నాయని.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ నిర్ణయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో ఫైల్‌ను తనకు పంపించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. త్వరలో ఏర్పాటయ్యే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు. -
రేపు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల పంపకాలపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశం అవుతుంది. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శలు హాజరుకానున్నారు. అధికారుల తుది జాబితాను కమిటీ రేపు ఖరారు చేయనుంది. అయితే పలువురు ఉన్నతాధికారుల అభ్యంతరాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఆ అభ్యంతరాలపై కమిటీ రేపు చర్చించనుంది. అనంతరం ఆ జాబితాను ప్రధాని నరేంద్ర మోడీకి కమిటీ పంపనుంది. మోడీ ఆమోద ముద్ర పడగానే పూర్తి స్థాయిలో విభజన జరగుతుంది. -
సీఎస్ పదవి పొడిగింపుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పదవి పొడిగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయింది. రాజిరెడ్డి దీన్ని దాఖలు చేశారు. కేబినెట్ అనుమతి లేకుండా ఆపద్ధర్మ ప్రభుత్వం సీఎస్ పదవి పొడిగింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం లేకుండా సీఎస్ పదవి పొడిగించడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి కొనసాగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్‌కు ఇంతకుముందు లేఖ రాశారు.