
సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.
సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇవాళే బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.
1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారాయన. సీఎం ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి దాకా అందేందుకు కృషి చేస్తానని, పల్లెల్లోని పేదలకు ఫలాలు అందేలా యంత్రంగాన్ని నడిపిస్తాని కేఎస్ జవహర్‌రెడ్డి ప్రకటించారు.