
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సీఎం జగన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి.. సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు.
చదవండి: (నాడు మోసగించి, నేడు లెక్చర్లా?)
Comments
Please login to add a commentAdd a comment