
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ అనేకసార్లు కోరారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు అంశాలపై కేంద్రంతో చర్చలు జరిపామని చెప్పారు. మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూలోటుతోపాటు పలు అంశాలను చర్చిస్తామని పేర్కొన్నారు.
ఈ మేరకు సీఎస్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనకు రావాలని సీఎంను కూడా కోరినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత పర్యటనల వాయిదాకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. తామంతా రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నామని.. అవసరమైతే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment