ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
Published Wed, Nov 30 2016 3:13 PM | Last Updated on Sat, Aug 18 2018 6:32 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్‌గా టక్కర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అనుమతించాల్సిందిగా గతంలో కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తొలుత మూడు నెలల పాటు సీఎస్‌గా టక్కర్ కొనసాగించేందుకు అనుమతించింది.
ఆ అనుమతి ఈ నెలాఖరుతో(నవంబర్ 30) ముగిసింది. అయితే టక్కర్‌ను మరో మూడు నెలలు సీఎస్‌గా కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి గత నెలలో మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం టక్కర్ పదవీ కాలాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం అమోదం తెలిపింది.
Advertisement
Advertisement