
సాక్షి, అమరావతి: అన్నిరాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంచార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇంచార్జ్ సీఎస్ తోపాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజాగా బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment