హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల పంపకాలపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశం అవుతుంది. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శలు హాజరుకానున్నారు. అధికారుల తుది జాబితాను కమిటీ రేపు ఖరారు చేయనుంది. అయితే పలువురు ఉన్నతాధికారుల అభ్యంతరాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఆ అభ్యంతరాలపై కమిటీ రేపు చర్చించనుంది. అనంతరం ఆ జాబితాను ప్రధాని నరేంద్ర మోడీకి కమిటీ పంపనుంది. మోడీ ఆమోద ముద్ర పడగానే పూర్తి స్థాయిలో విభజన జరగుతుంది.